How to handle our manners and behaviour in restaurants

how to handle our manners and behaviour in restaurants, restaurants, parks, hotels, behaviour, manners, visiting restaurants

how to handle our manners and behaviour in restaurants, restaurants, parks, hotels, behaviour, manners, visiting restaurants

మొదటిసారి రెస్టారెంట్ కు వెళ్తున్నారా...

Posted: 02/24/2014 11:30 AM IST
How to handle our manners and behaviour in restaurants

మామూలుగా మనుషులు ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, తీరికగా తమ సమయాన్ని గడిపేందుకు పార్కులకు, రెస్టారెంట్లకు, సినిమాలకు లేదా విహారయాత్రలకు వెళుతుంటారు. కానీ వెళ్లిన చోట్లలో మనం ఎలా వుండాలి..? ఎలా ప్రవర్తించాలి..? అన్న విషయాలపై చాలామందికి అవగాహన వుండదు. మరికొందరైతే తత్తరపడుతూ భయపడిపోతుంటారు. అటువంటి సమయాలలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. 

కొందరు రుచులను ఆస్వాదించడానికి రకరకాల హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళుతుంటారు. కానీ అక్కడ అందరూ కొత్తవారు కాబట్టి వారితో ఎలా వ్యవహరించాలన్న పద్దతి చాలామందికి తెలియదు. కొత్తవారితో వెళ్లినప్పుడైతే తత్తరపడిపోతారు. కాబట్టి మనకు తెలిసినవాళ్లతో వెళితే చాలామంచిది. ఎవరైతే హోటళ్లకు తీసుకెళతారు, వారే బిల్లు చెల్లించి, ఆర్డరివ్వడం మర్యాదగా వుంటుంది. 

మనం సర్వర్ కు ఆర్డర్ ఇవ్వడానికి ముందు వారితో అసభ్యంగా ప్రవర్తించకూడదు. వారిని పిలిచేటప్పుడు హెలో, ఎక్స్యూజ్ మీ, ఓయ్ లాంటి శబ్దాలను కాకుండా వారిని సాధ్యమైనంతవరకు మర్యాదగా పిలవడం శ్రేయస్కరం. వాళ్ల డ్రెస్ మీద వున్న వాళ్ల పేర్లతో పిలిస్తే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. దాంతో వారు సర్వీస్ చేయడానికి కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. 

ఒకవేళ సర్వర్ మనతో సరిగ్గా ప్రవర్తించకపోతే అతని మేనేజర్ కు ఇన్ ఫార్మ్ చేయడం మంచిది. గందరగోళ పరిస్థితులను ఏర్పడేలా చేయకూడదు. వంటకాలు సరిగా లేకపోతే సర్వర్ బాయ్ ని పిలిచి.. అనవసరంగా తిట్టడం వంటి విషయాలు చేయకూడదు. సర్వర్ మనతో సరిగ్గా నడుచుకుంటే అతనికి టిప్ ఇస్తే ఇంకా మంచిది. 

స్త్రీలతో వెళుతున్నప్పుడు వారితో కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాలి. వారితో వాగ్వాదం చేయకూడదు. ఎక్కువ అరవడం, ఫోన్లలో గట్టిగా మాట్లాడడం వంటి విషయాలు చేయకూడదు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలాగే సినిమా హాళ్లలో కూడా ఇటువంటి పొరపాట్లు కాకుండా చూసుకోవాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to improve career plans in college life

    కాలేజీ రోజుల్లో మలుచుకోవాల్సిన కెరీర్ ప్లాన్స్

    Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more

  • Career plans for girls

    కోరుకున్న కెరీర్ ని మలుచుకోవడం ఎలా?

    May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more

  • Tips for women to fought in office meetings

    మీటింగుల్లో మాట్లాడటానికి భయపడుతున్నారా..?

    Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more

  • Organizing tips for employees

    ఉద్యోగంలో ఉన్నతిని పొందడానికి రహస్య చిట్కాలు

    Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more

  • Tips to balance worklife

    వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడానికి చిట్కాలు

    Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more