ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోతోంది.
ప్రైవేటు కంపెనీలలో పనిచేసే మహిళలు కూడా ప్రాజెక్ట్ కు తగ్గట్టుగానే ఆఫీసులోనే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. అంతేకాదు.. ఒకవేళ ఆఫీసు పనిలో ఏవైనా బ్యాలెన్స్ వుంటే, వాటిని రాత్రులవరకు మేలుకొని ఇళ్లల్లో పూర్తి చేస్తున్నారు. దీంతోవారు తమ వ్యక్తిగత జీవితాన్ని అనుభవించలేక, అటు ఇంట్లో వున్నవారతో సమయాన్ని కేటాయించలేక, ఆఫీసు పనుల ఒత్తిడితో తీరిక లేకుండా జీవిస్తున్నారు.
ఉదయం లేచిన మొదలు రాత్రి చీకటి పడిన తరువాత కూడా ఆఫీసులకే పరిమితమయిపోతున్నారు. ఇంట్లోవాళ్లతో కలిసి కొద్దిసేపు సమయాన్ని సరదాగా గడపడానికి గాని, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి అస్సలు కుదరడం నేటి సమాజంలో పనిచేస్తున్న మహిళలకు.
అటువంటి సమయంలో కొన్ని ప్రణాళికబద్దమైన చిట్కాలను అవలంబించుకుంటే చాలు.. మీరు మీ ఆఫీసు పనులతోపాటు, ఇంట్లోవారితో కూడా హాయిగా సమయాన్ని కేటాయించుకోవచ్చు.
వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడానికి ప్రణాళికలు :
1. ముందుగా మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిపైనే దృష్టి సారించండి. ఆఫీసు పనులను తొందరగా పూర్తి చేసుకుంటే, ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. అలాగే ఇంట్లో వున్న పనులు, బాధ్యతలు మీరొక్కరే తీసుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
2. మొదటగా మీరు పూర్తి చేయాల్సిన పనులను పూర్తి చేయకముందే ఇతర బాధ్యతలను తీసుకోవడం వల్ల.. రెండింటినీ న్యాయాన్ని చేకూర్చలేరు. ఒకవేళ ఇలా చేయాల్సి వస్తే.. మీరు వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాన్ని ఒక్కసారిగా కోల్పోతారు.
3. ముందు మీరు మీ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఒక పనిని ఎంచుకోవాలి. అంటే ఆఫీసులో మీరు చేస్తున్న పనిమీదే దృష్టిని కేంద్రీకరించాలి. మీరు ఆఫీసులో ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడకుండా సమయాన్ని వృధా చేసుకోకూడదు. అంతేకాదు.. ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు తెగ వాడేస్తుంటారు. అయితే పని మధ్యలో వీటిని ఉపయోగించకూడదు. మధ్యమధ్యలో 10 నిముషాల వరకు విరామం తీసుకుంటే చాలా మంచిది. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.
4. మీరు పనిచేస్తున్న సమయంలో మీ కోలీగ్స్ గాని, మరేవరైనా గాని ఇతర పనులు అప్పగించినప్పుడు నిస్సందేహంగా వాటిని తిరస్కించండి. ముందు మీ పని ముగిసిన తరువాతే ఇతరుల పనిని కూడా మీరు సమర్థవంతంగా నిర్వర్తించుకోవచ్చు.
5. మీరు చేసే పర్ ఫెక్ట్ గా ఇతర ఆలోచనలు లేకుండా నిర్వర్తించుకోవాలి. అప్పుడే మీరు విజయాన్ని సాధించగలరు. అలా అని ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించుకోకూడదు. ప్రణాళికబద్ధంగా ఆఫీసు పనులను నిర్వర్తించుకుని వాటిని సాధ్యమైనంతవరకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కుటుంబసభ్యులతో కేటాయించుకోవడానికి వీలుగా వుంటుంది.
6. మీరు ఏదైనా ఒక పని చేయలేరు అనుకుంటే వాటిని అప్పుడే వదిలేయాలి. అనవసరంగా ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోకూడదు. ముందు ఏది అవసరం అయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు నిర్ణయించుకున్న సమయంలో ఆఫీసు పనులు పూర్తి కాకపోతే.. తరువాతి రోజు వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మిగతా వాటి గురించి ఆలోచించుకోవాలి.
ఇలా ఈ విధంగా మీరు ప్రణాళికలను పాటించుకుంటే.. ఆఫీసు పనులతోపాటు ఇంటివారితో కూడా సమయాన్ని హాయిగా గడపవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 07 | ఏదైనా ఒక కంపెనీలో మనం ఉద్యోగం సంపాదించాలంటే.. ముందుగా ఆ కంపెనీ వారికి మన గురించి తెలిసిన ఒక దరఖాస్తును సమర్పించుకుంటాం. దానినే రెజ్యూమ్ అంటారు. ఈ రెజ్యూమ్ లో మన గురించి, మనలో... Read more