Teluguwishesh 25.gif 25.gif devaraya movie review Product #: 40263 stars, based on 1 reviews
  • Movie Reviews

    devaraya-movie-innee

    చిత్రం పేరు :  ‘దేవరాయ’
    విడుదల తేదీ: 07 డిసెంబర్ 2012

    దర్శకుడు :    నానిక్రిష్ణ
    నిర్మాత :       కిరణ్ జక్కం శెట్టి, నానికృష్ణ
    సంగీతం :       చక్రి
    నటీనటులు :   శ్రీ కాంత్, విదిష, మీనాక్షి దీక్షిత్

    తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.00

    పరిచయం :
            ఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ తొలి సోషియో ఫాంటసీ ‘దేవరాయ’. శ్రీ.. ఈమూవీలో కృష్ణదేవరాయలు, దొరబాబు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు. విదిష, మీనాక్షి దీక్షిత్ హీరోయిన్లుగా జతకట్టారు. తన సినిమాను ఆపాలని కొందరు కుట్రపన్నుతున్నారని శ్రీకాంత్ మీడియా సాక్షిగా గొంతెత్తింది ఈ మూవీ కోసమే. ఎట్టకేలకు ఇవాళ దేవరాయ విడుదలైంది. ఈ సినిమాతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నానిక్రిష్ణ కథని ఎలా రక్తికట్టించాడో ఇప్పుడు చూద్దాం..


    చిత్ర కథ :
            ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయల మీద జరుగుతున్న పరిశోధన  క్రమంలో మన హీరో దొరబాబుకి రాయల వారికీ అవినాభావ సంబంధం ఉందని తేలుతుంది. దీంతో రాయల వారి తీరని ఆకాంక్షలు నెరవేర్చాలని దొరబాబు పూనుకుంటాడు. ఈ పరిణామ క్రమంలో చిన్న చిన్న మజిలీలు ఎదురయ్యే అవరోధాలను ఎలా హీరో చేధించాడనేదే క్లుప్తంగా ఈ చిత్ర సారాంశం.
        ఇక కథ లోతులకు వెళితే... పల్లెలో అల్లరి పనులు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు దొరబాబు(శ్రీ కాంత్). తొలిచూపులోనే స్వప్న(విదిష)తో ప్రేమలో పడతాడు. వీరి లవ్ ట్రాక్ హీరోయిన్ తాత (రంగనాథ్)కు ఇష్టం ఉండదు. ఇదిలా జరుగుతూఉండగా పురావస్తు శాస్త్రజ్ఞుడు (శివాజీ రాజా) గోదావరి తీరాన శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగిన ఓ విషయాన్ని గురించి పరిశోధన చేస్తూ.. రంగనాథ్ సహాయంతో ఆంధ్రభోజుడి పురాతన డైరీని అనువదించాలనుకుంటాడు. అది అనువదించిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అందులో దొరబాబుకి శ్రీ కృష్ణదేవరాయలుతో సంబంధం ఉందని తేలటంతో స్టోరీ పైన చెప్పిన టర్న్ తీసుకుంటుంది.


    విశ్లేషణ :
             మొత్తంగా చూస్తే శ్రీకాంత్ నటన ఓకే కానీ, కామెడీ చెయ్యాల్సినప్పుడు చిరంజీవిని, శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో సీనియర్ ఎన్.టి.ఆర్ ని కాపీ కొట్టాడనిపిస్తుంది. హీరోయిన్ విదిష సూపర్. మీనాక్షి దీక్షిత్ బావుంది. ఇక, నటులు బాలయ్య, రంగనాథ్, శివాజీ రాజా, ఎమ్.ఎస్ నారాయణ, రఘు కురుమంచి ఇంకా జయప్రకాశ్ రెడ్డి పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, దేవరాయల సంస్థానంలో చిత్రీకరించిన సీన్స్ బావున్నాయనిపిస్తుంది. లోబడ్జెట్ చిత్రమైనా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. 
            ఇక డ్రాబ్యాక్స్ విషయానికొస్తే, ముఖ్యంగా కథలో పటుత్వం లేకపోవటం, పాటల ప్లేస్ మెంట్, నానిక్రిష్ణ డైరెక్షన్ లోపాలు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా అంతంతమాత్రం. సినిమాటోగ్రఫీ ఓకే. వీరబాబు డైలాగ్స్ తేలిపోయాయి. చక్రి మ్యూజిక్ రక్తికట్టదు.


    చివరిగా చెప్పొచ్చేది :
           దేవరాయ హ్యాండిచ్చినట్లే....

    ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com