Teluguwishesh 1.png 1.png cameramen gangato rambabu movie reivew Product #: 38942 stars, based on 1 reviews
  • Movie Reviews

    Cameraman_Ganga_Tho_Rambab_inneree

    సినిమాపేరు : ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’
    విడుదల తేదీ: 18 అక్టోబర్ 2012

    దర్శకుడు : పూరి జగన్నాధ్
    నిర్మాత : డివివి దానయ్య
    సంగీతం: మణి శర్మ
    నటీనటులు : పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, నాజర్, తనికెళ్ల భరణి, 
    తెలుగువిశేష్.కాం రేటింగ్ 3.5


    ఇంట్రడక్షన్ :
    పవర్ స్టార్ సినిమా విడుదల అంటే అతని ఫ్యాన్స్ కే కాదు సినీ అభిమానులందరికీ పండుగ. గబ్బర్ సింగ్ అఖండ విజయంతో తారాస్థాయికి చేరిపోయిన పవన్ ఇమేజ్ నేపథ్యంలో అదే స్థాయిలో భారీ అంచనాల మధ్య ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  “బద్రి” చిత్రం తరువాత రేర్ కాంబినేషన్ పూరి-పవన్ ల కలయికలో రూపొందిన ఈ మూవీని డివివి దానయ్య నిర్మించారు.  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తమన్నా ఈ చిత్రంలో పవన్ సరసన నటించారు. కొద్దిసేపటిక్రితం వెండితెరలను తాకిన ఈ సినిమా తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
    స్టోరీ  :
            బ్రతుకుదెరువు రిత్యా సాధారణ మెకానిజ్ జీవితం గడిపే రాంబాబు(పవన్ కళ్యాణ్) సమాజిక స్ప్రుహ కలిగిన ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కలవాడు. ఇదే కోవలో డైలీ న్యూస్ పేపర్లు, టీవీ న్యూస్ లో వచ్చే వార్తలకు స్పందించి అన్యాయం జరిగిన వారికి బాసటగా నిలుస్తుండటం రాంబాబు నైజం. ఈ క్రమంలో టీవీ ఛానల్ లో కెమెరా మెన్ గా పని చేసే గంగ(తమన్నా) రాంబాబుని చూసి, అతని వ్యక్తిత్వం నచ్చి మీడియాలోకి వచ్చేలా ప్రేరేపిస్తుంది.
            మరోవైపు, జవహర్ నాయుడు (కోట శ్రీనివాస రావు) ప్రతి పక్ష నేత. తాను కోల్పోయిన ముఖ్యమంత్రి పదవిని తిరిగి దక్కించుకోవాలని కుటిలయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో అడ్డు పడిన దశరథ రాములు(సూర్య) అనే జర్నలిస్ట్ ని తన కొడుకైన రానా నాయుడు(ప్రకాష్ రాజ్) చేత చంపిస్తాడు. ఈ దారుణాన్ని పసిగట్టిన రాంబాబు రానా నాయుడుని పోలీస్ లకు పట్టిస్తాడు. ఈ విషయమై కక్ష పెంచుకున్న రానా.. రాంబాబుతో గొడవ పడతాడు. ఈ గొడవలో రాంబాబు ముఖ్యమంత్రి కావాలనని కలలుగంటోన్న రానా నాయుడుని ముఖ్యమంత్రి కానివ్వను అని ఛాలెంజ్ చేస్తాడు. రానా నాయుడు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి రాంబాబు ఏం చేశాడు? స్మిత(గబ్రియేలబెర్తంతే) ఎవరు? ఆ పాత్రకి రాంబాబుకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆపరేషన్ లో గంగ ఎలా తోడ్పడింది. రాంబాబు ఒక వ్యక్తి నుండి శక్తిలా ఎలా మారాడు. తదితర అంశాలు తెరపై చూడాల్సిందే.
    మూవీలో ప్లస్,  మైనస్ పాయింట్లు :
          ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ పవన్ కళ్యాణ్ అందులో ఎవరికీ సందేహం ఉండదు. అందరూ అనుకున్నట్టుగానే పవన్ మొత్తం  సినిమాని తన భుజస్కందాలమీద మోసాడు.  తనదైన స్టైల్లో డైలాగ్ డెలివరీ, సమయస్పూర్తితో కూడిన ఆలోచనతో జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలని దిశానిర్థేశం చేశాడు.   కథనానికి హీరోయిన్  తమన్నా అందచందాలు, నటన బాగా తోడ్పడింది. కథ రక్తికట్టడంలో ఆమె పాత్రకు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంది. వీరి మధ్య సంభాషణలు అందరినీ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. కథనం నడిపించటంలో దర్శకుడుడి ప్రతిభ పరాకాష్టకు చేరింది.
             కోట శ్రీనివాస్ రావు, ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పక్కర్లేదు. దర్శకుడిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అలీ, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ షరామామూలుగనే నవ్వులు కురిపించాయి. పవన్-బ్రహ్మీ మధ్య నడిచే సన్నివేశాలు సూపర్బ్. ఎం ఎస్ నారాయణ కు ఈ మూవీలో మంచి పాత్ర లభించింది. ఇక సీఎం పాత్రలో నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హాట్ బ్యూటీ గబ్రియేల, తనికెళ్ళ భరణి మెప్పించారు. పూరీ డాషింగ్ డైలాగ్స్ చురకత్తిలాంటి పవన్ డెలివరీ తోడవటంతో ఔట్ పుట్ అదిరిపోయింది. క్లైమాక్స్ మొత్తం రంజుగా సాగింది.
            సెకండాఫ్ ఒకటిరెండుచోట్ల కథ నెమ్మదించినట్టు అగుపించటం, టైటిల్లో ఉన్నట్టుగా కాకుండా, కెమెరామెన్ గంగ పాత్ర పరిమితంగానే ఉండటం ప్రతికూల అంశంగా పరిగణించవచ్చు.       
    టెక్నికల్ టీం పనితనం :
     శ్యాం. కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం. మణిశర్మ అందించిన పాటలను తెరకెక్కించిన విధానం కూడా చూడచక్కగా ఉండటం విశేషం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఓకే. పూరీ జగన్నాథ్ కథ, కధనం, స్క్రీన్ ప్లే లో ప్రొఫెషనలిజం కనిపిస్తుంది.
    ముగింపు  :
    తన చిత్రం ద్వారా ఏదోక సందేశం సమాజానికి అందించాలని తపించే  పవర్ స్టార్ ఈ తాజా  మూవీ లో  మీడియాకు, రాజకీయనేతలకు, ఇటు ప్రజానీకానికి దిక్సూచిలా కనిపిస్తాడు. అంతేకాదు ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్నికల్పించింది. అటు పూరీ పంచ్ డైలాగ్స్ తో పాటు వినోదాన్నీ సమపాళ్లలో రంగరించటం, అన్నిటికంటే మిన్నగా అన్నీ తానై చేసిన పవన్ కళ్యాణ్ నటన సినిమా విజయానికి బాక్సాఫీస్ వసూళ్లకు రాచబాట వేస్తుంది.

    ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com