Nayak svsm movie halchal in 2nd week also

ramcharan nayak, seetamma vakitlo sirimalle chettu, svsm movie halchal, nayak collections, svsm collections, nayak casting, svsm casting, nayak teaser, svsm teaser

nayak svsm movie halchal in 2nd week also

1.gif

Posted: 01/18/2013 11:31 AM IST
Nayak svsm movie halchal in 2nd week also

nayake

       సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రావటం మామూలే. అయితే వీటికి తోడుగా ఏవో కొన్ని చిన్నసినిమాలుకూడా పెద్దపండుగకు సందడిచేస్తాయి. అయితే ఈ దఫా పండుగవేళ చిన్న సినిమాలు తమ ఉనికిని కోల్పోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘నాయక్’,  విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా వచ్చిన ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ ఈ రెండు మూవీలే మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రెండో వారంలోకూడా ఈ సినిమాలకు జోరుకి బ్రేకులు వేయలేమనే ఉద్దేశంతో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద తెలుగు సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కావున ఈ వారంకూడా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హవాని కొనసాగించనున్నాయి. ఈ సినిమాలకున్న క్రౌడ్స్ ఇలాగే కొనసాగితే ఈ వారం కూడా రికార్డ్ స్థాయిలోనే కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
     ఇదిలా ఉంటే, ఈ రెండు చిత్రాలే రాష్ట్రంలోని థియేటర్లను శాసిస్తున్నాయని, దీనికి కారణం ఇండిస్టీలో ''ఆ నలుగురు'' అని కొందరు చిన్న నిర్మాతలు గుర్రుగాఉన్నారు. సంక్రాంతి కానుక అంటూ పండుగకుముందే విడుదలైన చిత్రాలు నాయక్‌, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు.. ఈ రెండు చిత్రాలు రాష్ట్రంలో వున్న థియేటర్లన్నిం టినీ ఆక్యుపై చేశాయి. ఎక్కడ ఏ చిన్న ఊరు వున్నా అక్కడ ఈ రెండు చిత్రాలే నడుస్తున్నాయి. దీనికితోడు ప్రతి థియేటర్ల లోనూ మేనేజర్ల హవా నడుస్తోంది.

sss
        తెలంగాణా, ఆంధ్ర లోని మారుమూల ప్రాంతాల్లోని థియేటర్లలో కెపాసిటీకి మించి టిక్కెట్లు ఇవ్వడం, సెపరేట్‌ కుర్చీలు వేయడం జరిగింది. కోదాడలోని ఓ థియేటర్‌లో థియేటర్‌కు మించి జనాలున్నా... హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్ట కుండా హాలు నింపేశాడు. ప్రత్యేకంగా కుర్చీలువేసి మరీ చూపించే ఏర్పాట్లు చేశారు. కొందరైతే ఇదేమని అడిగితే.. చూస్తే చూడండి.. లేదంటే లేదు.. ఇక్కడ ఇలాగే వుంటుందని చెప్పడం విశేషం.దీంతో తమకు రావాల్సిన ఆదాయం కూడా గండికొట్టేశారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు.
        శ్రీకాంత్‌ చిత్రం సేవకుడు వారంముందు రిలీజ్‌ అయినా ఆ రెండు చిత్రాలు విడులకావడంతో అన్నిచోట్ల ఎత్తేశారు. ఏదో మారుమూల థియేటర్లలో ఒకటి అర థియేటర్లలో మాత్రమే సేవకుడు, కొన్ని చిన్న చిత్రాలు ఆడుతున్నాయి. మిగిలిన హీరోల చిత్రాలు విడులకు సిద్ధంగా వున్నా... థియేటర్లు లేక వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఫిలింఛాంబర్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ar rahman followers in social networking sites
Srikanth addala to direct naga babu son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles