Sanjita Chanu clinches gold at CWG ఖాతాలో రెండో స్వర్ణం.. లిఫ్టింగ్ లో మెరిసిన సంజిత చాను

Sanjita chanu wins gold by setting a record in weightlifting

Sanjita Chanu, Weightlifter Sanjita Chanu, India, CWG Games 2018, Sanjita Chanu wins Gold medal, Weightlifting, Sanjita Chanu breaks her record, Commonwealth Games 2018, Indian Weightlifter Sanjita chanu, Loa Dika Toua, sports news,sports, latest sports news

Indian Weightlifter Sanjita Chanu took 104 kilograms in her first attempt of clean and jerk and Wins Second Gold medal for Team India.

ఖాతాలో రెండో స్వర్ణం.. లిఫ్టింగ్ లో మెరిసిన సంజిత చాను

Posted: 04/06/2018 06:32 PM IST
Sanjita chanu wins gold by setting a record in weightlifting

అస్ట్రేలియాలో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ రెండో రోజు కూడా అదరగొట్టింది. తొలి రోజున ఒక స్వర్ణంతో పాటు మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్న భారత్.. రెండో రోజును కూడా పసిడి పతకాన్ని ఖాతాలో జమేసుకుంది. అయితే తొలి పతకంగా రజతంతో భారత్ ఖాతాను తెరచిన గురురాజా సహా స్వర్ణం సాధించిన మీరాబాయ్ చాను కూడా వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలోనే రెండో రోజున భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల 53 కేజీల విభాగంలో భారత్ కు చెందిన సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. భారత్‌ ఇప్పటి వరకు గెలిచిన మూడు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలోనే దక్కడం విశేషం.

ఇవాళ రెండో రోజు స్వర్ణం గెలిచిన సంజితా చానుపై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘భారతీయ నారీమణులు అందరి కంటే ఎంతో గొప్పవారు. మరో స్వర్ణం గెలిచాం. భారత్ కు రెండో బంగారు పతకం అందించిన సంజితా చానుకు అభినందనలు’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ‘ఈ రోజు గొప్ప ఆరంభం దక్కింది. సంజితా చానుకు కంగ్రాట్స్‌. ఎంతో గర్వంగా ఉంది’ అని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్ అన్నాడు.  2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో సంజితా చాను 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ (12), ఆస్ట్రేలియా (15)  అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  3st ODI  cape town odi  virat kohli  Ajinkya Rahane  cricket  

Other Articles