Vijender Singh eyeing another knock-out punch నాకౌట్ ద్వారానే జిల్పికర్ పై విజయం: విజేందర్

Vijender singh says chinese product zulpikar maimaitiali won t last long

Vijender Singh, Zulpikar Maimaitiali, boxing, WBO Oriental, WBO Asia Pacific, Beijing Olympics, Olympic Games, sports news, latest news, latest sports news

Vijender Singh’s “Chinese products” remark has provoked his next opponent Zulpikar Maimaitiali to issue a strong retort ahead of their eagerly-awaited bout titled ‘Battleground Asia’.

నాకౌట్ ద్వారానే జిల్పికర్ పై విజయం: విజేందర్

Posted: 08/01/2017 07:03 PM IST
Vijender singh says chinese product zulpikar maimaitiali won t last long

ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టి తన అప్రతిహాత విజయాలతో ప్రత్యర్థులను మట్టికరిపించన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్.. తన కెరీర్లోనే ఒక్క బౌట్ మినహా అన్నింటిలో నాకౌట్ ద్వారానే విజయాలను నమోదు చేశాడు. ఇప్పటివరకు ఎనిమిది బౌట్లలో పోటీపడిన అయన ఏడింటిలో నాకౌట్‌ విజయాలు అందుకున్నాడు. తాజాగా అగస్టు 5న జరగున్ను బౌట్ లో కూడా తాను నాకౌట్ ద్వారానే విజయాన్ని నమోదు చేస్తానని భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

గత ఎనమిడి బౌట్లలో ఏడింటిలో ప్రదర్శించిన జోరునే కొనసాగిస్తానని తేల్చిచెప్పాడు. ముంబైలో ఈ శనివారం జరగనున్న బౌట్ లో చైనాకు చెందిన జిల్పికర్ మైమైతియాల్ తో జరగనున్న బౌట్ లో కూడా నాకౌట్ ద్వారానే గెలిచి తన జోరును కొనసాగిస్తానని అన్నాడు. విజేందర్‌ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ చాంపియన్‌ కాగా... జుల్పికర్‌ డబ్ల్యూబీఓ ఒరియంటల్‌  సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ చాంపియన్‌. ఈ బౌట్‌లో గెలిచిన బాక్సర్ కు ఏకకాలంలో రెండు టైటిల్స్‌ లభిస్తాయి. ‘నా కోసం ప్రార్థించండి. మరో నాకౌట్‌ విజయం కోసం వంద శాతం కృషి చేస్తాను. సాధ్యమైనంత తొందరగా బౌట్ ను ముగిస్తాను’ అని విజేందర్‌ ధీమా వ్యక్తం చేశాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian boxer  chinese boxer  Vijender Singh  Zulpikar Maimaitiali  boxing  knock out  Olympic Games  

Other Articles