PV Sindhu, Kidambi Srikanth Go a Step Closer to Medals, Enter Quarter-Finals

Shuttler pv sindhu enters olympic quarters

Olympics 2016,India,Badminton Rio 2016 Badminton: PV Sindhu, Kidambi Srikanth Go a Step Closer to Medals, Enter Quarter-Finals latest Olympics 2016 news, badminton olympics live, badminton live updates, Pv sindhu, olympics live, olympics news

PV Sindhu and Kidambi Srikanth stormed into the quarterfinals of badminton women's and men's singles events, respectively, at Rio Olympics 2016 with thrilling wins

రియో ఒలంపిక్స్ ఆశలు రేపుతున్న పివి సింధు

Posted: 08/16/2016 06:39 PM IST
Shuttler pv sindhu enters olympic quarters

రియో ఒలంపిక్స్ లో భారత్ క్రీడాకారులందరూ భారత క్రీడాకారుల పతకాల ఖాతా తెరవకుండానే ఒక్కొక్కరుగా రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్న తరుణుంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు మాత్రం ఆశలు రేపుతున్నారు. క్రితం రోజున కిదాంబి క్వార్టర్స్ లోకి ప్రవేశించగా, ఇటు వుమెన్స్ సింగల్స్ లో పివి సింధు కూడా క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. మెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జోర్గెన్‌సన్‌పై విజయంతో శ్రీకాంత్.. క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, పివీ సింధూ కూడా ప్రీక్వార్టర్స్ లో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్స్ లోకి చేరింది.

మహిళల సింగిల్స్ విభాగంలో తన కంటే ఎంతో మెరుగైన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్పై సింధు గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. భారత  కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 15-21  తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది. ఈ మ్యాచ్కు ముందు వరకూ వీరిద్దరి ముఖాముఖి పోరులో యింగ్ 4-2తో ముందంజంలో ఉంది. దీంతో యింగ్ నే మ్యాచ్ ఫేవరెట్గా పరిగణించగా, సింధు మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆద్యంతం దూకుడును కనబరిచిన సింధు.. తొలి గేమ్ను అవలీలగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్లో యింగ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరకు సింధునే పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్ల్లో ఏకపక్ష విజయం సాధించిన సింధు పదునైన స్మాష్లతో అలరించి నాకౌట్ పోరుకు సిద్ధమైంది. దీంతో క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిహాన్తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  rio  olympics  quarters  badminton  

Other Articles