Indonesia Open: Saina Nehwal loses to Carolina Marin in quarters

Saina nehwal crashes out of indonesia open super series

saina nehwal, nehwal, indonesia open, indonesia open saina nehwal, saina nehwal vs carolina marin, carolina vs saina, saina vs carolina, badminton

India's campaign at the Indonesia Open Super Series ended on Friday after ace shuttler Saina Nehwal bowed out in the quarter-finals.

ఇండోనేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా ఔట్..!

Posted: 06/03/2016 07:20 PM IST
Saina nehwal crashes out of indonesia open super series

ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా  22-24, 11-21 తేడాతో  వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్(స్పెయిన్)చేతిలో ఓటమి పాలైంది.  తొలి గేమ్ లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్ లో తీవ్ర ఒత్తిడికి లోనై పరాజయం చెందింది. తొలి గేమ్ ఆదిలో మారిన్ 11-7 తేడాతో  ఆధిక్యం సాధించి ముందుకు దూసుకుపోయింది.

అయితే ఆ తరువాత పుంజుకున్న సైనా 14-14 తో స్కోరును సమం చేసింది.  ఇదే క్రమంలో సైనా 16-14, 19-18తో ఆధిక్యం సాధించి తొలి గేమ్ ను గెలుచుకునే దిశగా సాగింది. కాగా, స్కోరు 20-20 వద్ద ఉండగా ముందంజ వేసిన మారిన్ తొలి గేమ్ ను కైవసం చేసుకుంది. ఇక  రెండో గేమ్ లో సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం పైచేయి సాధించిన మారిన్ ఆ గేమ్ ను దక్కించుకుని సెమీస్ లో కి ప్రవేశించింది. కరోలినా తన తదుపరి సెమీస్ పోరులో వాంగ్ యిహాన్ తో తలపడుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  Carolina Marin  Indonesia Open  badminton news  

Other Articles