China Open 2015 results: Saina Nehwal reaches quarter final, PV Sindhu knocked out

Saina nehwal advances in china opem pv sindhu exits

China Open results,Saina Nehwal reaches quarter finals,PV SIndhu knocked out of China Open,Wang Shixian,PV Sindhu,Saina Nehwal defeats Tee Jing Yi,Saina Nehwal will face Nozomi Okuhara in quarter final,Saina Nehwal CHina Open,Saina Nehwal,Saina Nehwal China Open quarter final

India have had a mixed day in the ongoing China Open with Saina Nehwal progressing to the quarter finals while PV Sindhu had to suffer an unfortunate exit.

చైనా ఓపెన్: క్వార్టర్స్ లోకి సైనా.. సింధూ ఓటమి

Posted: 11/12/2015 03:48 PM IST
Saina nehwal advances in china opem pv sindhu exits

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ మరోమారు తన సత్తాను చాటుకుంటూ దూసుకెళ్తోంది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇవాళ జరిగిన మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరింది. గురవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ సైనా నెహ్వాల్ మలేషియా క్రీడాకారిణి జింగ్ యిపై విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో సైనా తన ప్రత్యర్థిని 21-10, 19-21, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.

55 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా తొలి సెట్ ను అవలీలగా గెలిచినా.. రెండో సెట్ లో యి చేతిలో ఓటమిపాలైంది. ఇక మూడో సెట్ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. నిర్ణయాత్మకమైన ఈ సెట్ లో సైనా తొలుత వెనుబడినా..  చివర్లో పుంజుకుని గేమ్ ను చేజిక్కించుకుంది.  దీంతో పైనా నెహ్వాల్ తన తదుపరి పోరులో నజోమి ఒకుహరా(జపాన్) తో తలపడనుంది.
 
ఇదిలా ఉండగా, మరో మ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత పివి సింధు ఓటమి పాలైంది. సింధు 21-18, 18-21, 16-21 తేడాతో షియాన్ వాంగ్(చైనా) చేతిలో పరాజయం చెంది ఇంటి దారి పట్టింది. గత నెలలో జరిగిన డెన్మార్క్ ఓపెన్ లో అంచనాలకు మించి రాణించి ఫైనల్ కు చేరిన సింధు.. చైనా ఓపెన్ లో ఆదిలోనే నిష్క్రమించడం భారత అభిమానుల్ని నిరాశపరిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina nehwal  pv Sindhu  China Open  Ajay jayaram  kidambi srikanth  

Other Articles