China Open 2015 results: Saina Nehwal reaches finals

Saina nehwal enters into china open finals

China Open results,Saina Nehwal reaches quarter finals,PV SIndhu knocked out of China Open,Wang Shixian,PV Sindhu,Saina Nehwal defeats Tee Jing Yi,Saina Nehwal will face Nozomi Okuhara in quarter final,Saina Nehwal CHina Open,Saina Nehwal,Saina Nehwal China Open quarter final

India had a good day in the ongoing China Open with Saina Nehwal progressing to the finals

చైనా ఓపెన్: :పైనల్స్ లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్..

Posted: 11/14/2015 06:22 PM IST
Saina nehwal enters into china open finals

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ మరోమారు తన సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. మరోమారు చైనా టైటిల్ సోంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది భారత స్టార్ షట్లర్ సైనా. ఇవాళ జరిగిన సమీస్ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి క్రీడాకారిణిని మట్టికరిపించిన సైనా నెహ్వాల్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఫుజోహ్ వేదికగా ఇవాళ జరిగిన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ సెమీ ఫైన్సల్ పోరులో సైనా నెహ్వాల్ విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది.
 
ఇవాళ జరిగిన సెమీ ఫైనల్లో సైనా మాజీ ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా)తో ఫెస్ టు ఫేస్ తలపడి కేవలం రెండు సెట్లలోనే విజయాన్ని నమోదు చేసుకుంది. 21-13, 21-18 తేడాతో సైనా, వాంగ్ పై గెలిచి ఫైనల్‌కు చేరింది. కేవలం 41 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా వరుస బ్రేక్ పాయింట్లు సాధించి పైచేయి సాధించింది. తొలి సెట్‌ను సైనా అవలీలగా గెలిచినా.. రెండో సెట్‌లో మాత్రం వాంగ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. ఈ యేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో యిహాన్ వాంగ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సైనా.. చైనా ఓపెన్‌లో కూడా అదే జోరును కొనసాగించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina nehwal  pv Sindhu  China Open  Ajay jayaram  kidambi srikanth  

Other Articles