jayaram-gurusai-enters into quaters-in-dutch-open

Ajay jayaram and gurusai advances into quarter final in dutch open

Dutch Open Grand Prix, Topsportcentrum Almere,Jayaram, Gurusai dutt, Dutch Open badminton, shuttler Ajay Jayaram, R.M.V. Gurusaidutt, Korea Open,

Indian men's singles shuttlers Ajay Jayaram and R.M.V. Gurusaidutt won their respective first two matches to enter quarter finals in Dutch Open Grand Prix, being played at the Topsportcentrum Almere here.

డచ్ ఓపెన్ క్వార్టర్స్ లోకి జయరామ్, గురుసాయి

Posted: 10/09/2015 07:13 PM IST
Ajay jayaram and gurusai advances into quarter final in dutch open

డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ అభిమానులు అంచనాలను తలకిందలు చేస్తూ.. అజయ్ జయరామ్, గురుసాయిదత్ లు చక్కటి ప్రతిభతో అద్భుతంగా దూసుకెళ్తున్నారు. మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్న వీరిద్దరూ పురుషుల సింగల్స్ విభాగంలో క్వార్టర్స్ లోకి దూసుకెళ్లారు. గత నెలలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన జయరామ్ కోరియా ఓపెన్ లో పురుషుల సింగిల్స్ లో ఫైనల్ వరకు దూసుకళ్లాడు. ఇప్పడు కూడా అదే తరహా ఆటను ప్రదర్శించి.. మున్ముందుకు దూసుకెళ్తున్నాడు. అజయ్ జయరామ్ కు తోడుగా గురుసాయిదత్ కూడా పురుషుల సింగిల్స్ లో బాగానే రాణిస్తున్నాడు.

పురుషుల సింగిల్స్ మూడవ సీడ్ కు చెందిన అజయ్ జయరామ్ రెండో రౌండ్లో  21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ ను ఓడించి ప్రీక్వార్టర్స్ కు చేరుకున్న జయరాయ్ అదే దూకుడుతో ఇవాళ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.  ప్రీక్వార్టర్స్లో అజయ్ జయరామ్ 21-14, 21-13 స్కోరుతో కాస్పెర్ లెహికోనెన్ (ఫిన్లాండ్) పై విజయం సాధించాడు.  మరో మ్యాచ్లో గురుసాయి 21-12, 21-11తో దిమిత్రో జవడ్స్కీ (ఉక్రెయిన్)ను ఓడించాడు. క్వార్టర్స్లో రాల్ మస్ట్ (ఈస్తోనియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaram  Gurusai dutt  Dutch Open badminton  

Other Articles