Usain Bolt will make call on retirement after 2016 Rio Olympics

Jamaica s usain bolt yet to put a date on retirement

Usain bolt, retire, rio, 2016, video, olympics, 100m, 200m, 2016 rio olympic Games, Usain Bolt, jamica sprinter, world record, Sport

Sprinter says he wants to cement legendary status by retaining his Olympic championship for third time

రియో ఒలంపిక్స్ తో బోల్ట్ రిటైర్మెంట్ అలోచన

Posted: 10/09/2015 07:12 PM IST
Jamaica s usain bolt yet to put a date on retirement

స్ప్రింట్లో ప్రపంచ రికార్డులు సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్.. 2016 రియో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. రియోలోనూ పతకాలు గెలిస్తే లెజెండ్ అవుతానిన బోల్ట్ అన్నాడు. స్ప్రింట్లో ఎదురులేని బోల్ట్ 100, 200 మీటర్ల రేసుల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలు సాధించాడు. 'రియోలోనూ గెలిస్తే అమితంగా సంతోషిస్తాను. లెజెండ్ అవుతాను. అప్పుడు ఎవరైనా అడిగితే నేను లెజెండ్ అని చెబుతాను' అని బోల్ట్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ కోసం వచ్చే నెలలో సాధన ప్రారంభిస్తానని చెప్పాడు.

అంతేకాదు పనిలో పనిగా తన మనస్సులోని అలోచనను కూడా మీడియా ముందు పెట్టాడు బోల్ట్. అదే తన రిటైర్మెంట్‌. చైనాలోని బీజింగ్ లో జరిగే రియోనే తనకు చివరి ఒలింపిక్స్‌ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్‌.. 2017లో జరిగే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌ కోసం సోమవారం నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెట్టనున్నట్టు బోల్ట్‌ చెప్పాడు. ఇక రిటైర్మెంట్‌ తర్వాత ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. అయితే క్రీడారంగంలోనే ఉండాలని అనుకుంటున్నానని బోల్ట్‌ పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2016 rio olympic Games  Usain Bolt  jamica sprinter  

Other Articles