7 men in race for FIFA’s top job, Indian-American amongst them

Michel platini confirms he will run for fifa president

Michel Platini confirms he will run for FIFA president, 7 men in race for FIFA’s top job, Indian-American FIFA president post, football, Michel Platini, FIFA, President, Sepp Blatter, Sunil Gulati, Allahabad-born Gulati, UEFA president, FIFA vice-president, federations in Europe, Michel Platini, France, Prince Ali bin Al Hussein, Jordan, erome Champagne, France, Wolfgang Niersbach, Germany, Domenico Scala, Italy/Switzerland, Jerome Valcke, France

Michel Platini says he will run in the election to succeed Sepp Blatter as FIFA president. Platini, the UEFA president and a FIFA vice-president, has written to member federations in Europe saying he will stand and is counting on their support.

ఫీపా అద్యక్ష బరిలో ఏడుగురు.. ఫిబ్రవరిలో ఎన్నికలు

Posted: 07/29/2015 07:25 PM IST
Michel platini confirms he will run for fifa president

ఫీఫా అధ్యక్ష పదవి అంటే అత్యంత పెద్ద క్రీడకు అద్యక్షుడన్న మాట. ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది అభిమానులు వున్న ఆటకు నేతృత్వం వహించడమే. అంతేకాదు ఎన్నో వేల కోట్ల రూపాయల లావాదేవీలతో ముడిపడి వున్న పదవిని అధిరోహించడం. మరో మాటలో చెప్పాలంటే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. కన్నా అత్యంత పెద్ద, అత్యంత అధిక ఆదాయమున్న సంస్థ ఫిఫా. సెప్ బ్లాటర్ సహా ఆయనతో పాటు ఎన్నికై ఇటీవల ముడుపుల కేసులో అభియోగాలు ఎదుర్కుని.. కోర్టులో విచారణను ఎదుర్కోంటున్న పాలక మండలి మొత్తం రద్దు కావడంతో.. ఫిబ్రవరి 26న ఫీఫా పాలక మండలికి ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఫిఫా అధ్యక్ష రేసులో తాను ఉన్నట్లు మిచెల్ ప్లాటిని ఇవాళ ప్రకటించారు. ప్రస్తుతం యూఈఎఫ్ఎ అధ్యక్షుడిగా, ఫిఫా ఉఫాద్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్లాటిని తాను ఫిఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యూరోప్ మెంబర్ ఫెడరేషన్ ను కోరారు. తాను ఐరోపా మెంబర్ ఫెడరేషన్స్ కు మద్దతుగా నిలుస్తానని, అదే సమయంలో వారి మద్దతు ఎంతలా తనకు ప్రకటిస్తారో వేచిచూస్తానని చెప్పారు. సెమ్ బ్లాటర్ అనుంగు అనుచరుడిగా ఎన్నో ఏళ్ల పాటు ఫిఫాకు సేవలందించిన ప్లాటిని సహా ఈ పోటీల్లో మొత్తం ముగ్గురు ప్రెంచ్ దేశస్థులు పోటీ పడుతున్నారు. మొత్తంగా ఏడుగురు ఫిఫా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా, అందులో అమెరికా నుంచి భారతీయ సంతతికి చెందిన సునీల్ గులాటీ కూడా వున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలంటే వేచి చూడాల్సిందే మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : football  Michel Platini  FIFA  President  Sepp Blatter  Sunil Gulati  

Other Articles