Italian amateur soccer president fired for allegedly calling women players ‘lesbians’

Italian football chief sacked for lesbian remarks

president of Italy's amateur footall federation, football, Italian Football Federation, Felice Belloli, Italian Football Federation (FIGC), homophobic comments, women footballers, La Gazzetta dello Sport, FIGC president Carlo Tavecchio,

The president of Italy's amateur footall federation, Felice Belloli, was sacked from his post following reports he made homophobic comments against women footballers, according to reports.

సెక్యూవల్ రిమార్స్క్ ఎఫెక్ట్: అధ్యక్ష పదవి నుంచి బెల్లోలీ ఔట్

Posted: 05/22/2015 10:14 PM IST
Italian football chief sacked for lesbian remarks

మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణలపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. గత కోన్నాళ్లుగా సమర్థించుకుంటూ వస్తున్న ఇటలీయన్ అమేచూర్ ఫుట్ బాల్ అసోసియేషన్ అద్యక్షుడు ఫెలీస్ బెల్లోలికి ఎట్టకేలకు పదవి నుంచి ఉద్వాసన పలికారు. ఈ మేరకు ఇటలీలోని రోమ్ లో సమావేశమైన ఇటాలియన్ అమేచూర్ సాకర్ లీగ్ ఆయనను నిర్వంధ్దంగా పదవి నుంచి తొలగిస్తూ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. బెల్లోలీ చేసిన వ్యాఖ్యలపై మహిళా పుల్ బాల్ క్రీడాకారులు ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. ఇంకా బెల్లోలీని పదవిలో కోనసాగిస్తే సహించమని ప్రకటించిన పలు మహిళా ఫుట్ బాల్ క్రీడా సంఘాలు.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు సిద్దమయ్యాయి.

మహిళా ఫుట్ బాల్ క్రీడాకారులకు నిధులను సమకూర్చే విషయమై మార్చి మాసంలో సాగిన సమావేశంలో వారిని సంబోధిస్తూ.. వారంతా స్వలింగ సంపర్కులని నిందిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలను చేశారని ఓ ఇటలీకి చెందిన మీడియా బట్టబయలు చేయడంతో విషయం బట్టబయలైంది. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బెల్లోలీ ఎల్ ఎన్ డి ఫుట్ బాల్ బోర్డుకు చెబుతూ వస్తున్నారు. అయితే మార్చి నుంచి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా పుట్ బాల్ క్రీడాకారులు మండిపడుతూనే వున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఇవాళ భేటీ అయిన ఇటాలియన్ అమేచూర్ సాకర్ లీగ్ అర్గనైజేషన్ బోర్డు సమావేశంలో మూకుమ్మడిగా డైరెక్టర్లందరూ ఆయన వ్యాఖ్యలపై సిరియస్ గా పరిగణించి బెల్లోలీని పదవి నుంచి తోలగిస్తున్నట్లు ప్రకటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles