Kerala: Athlete commits ‘suicide', 3 others consume poison in sports hostel; kin allege harassment

Athelete die after trainers harrassment

Kerala athlete, Sports Authority of India, Kerala athlete suicide, Aparna Ramachandran, athlete suicide, Trainer harrasment, Kerala: Athlete commits ‘suicide', suicide, sport, athlete, Sports Authority of India (SAI), Poison, probe, harrasment, Hostel

A 15-year-old sportsperson died on May 7 and three others, all undergoing training at Water Sports Centre of Sports Authority of India in Alappuzha have been hospitalised, after they ate a poisonous fruit in an apparent suicide pact following alleged harassment by trainer.

శిక్షకుడి వేధింపులకు అథ్లెట్ ఆత్మహత్య

Posted: 05/07/2015 05:45 PM IST
Athelete die after trainers harrassment

కేరళలో విషాదం చోటుచేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణా సంస్థలో శిక్షకుడి వేధింపులు భరించలేక నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అందులో ఒక క్రీడాకారిణి మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. 15 ఏళ్ళ క్రీడాకారిణి అపర్ణ మృతి చెందడంతో విషయంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుఝా జిల్లాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో కయాకింగ్, కనోయింగ్ క్రీడలను విద్యార్థులు నేర్చుకుంటున్నారు. కాగా అక్కడి శిక్షకుడి వేధింపులను భరించలేక, నలుగురు క్రీడాకారిణులు విష ఫలాలు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం సాయంత్రం అపస్మారక స్థితిలో హాస్టల్ లో ఉన్న ...వీరిని వార్డెన్ గుర్తించి హెల్పర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు.

కాగా, ట్రైనర్ తీవ్రమైన వేధింపులకు తట్టుకోలేకే తమ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని.. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. అయితే అధికారులు మాత్రం వేధింపుల ఆరోపణలను ఖండిస్తున్నారు. బీర్ తాగిన క్రీడాకారిణిలను మందలించటంతో వారు ఈ సంఘటనకు పాల్పడినట్లు శిక్షణా సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ వార్తలను వారి తల్లితండ్రులు ఖండిస్తున్నారు. హాస్టల్ కి వచ్చిన విద్యర్థినులు బీర్ తాగుతున్నారని, వారిపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : athlete  suicide  Trainer  water sport  

Other Articles