Telangana cm kcr praises saina nehwal all england badminton tournament

saina nehwal news, saina nehwal photos, saina nehwal updates, saina nehwal photo shoot, saina nehwal title, all england badminton tournament, all england badminton tour, saina nehwal shutler, saina nehwal career, kcr news, cm kcr updates, cm kcr press meet, cm kcr gallery, cm kcr press meet, cm kcr photos

telangana cm kcr praises saina nehwal all england badminton tournament : Telangana cm kcr praises Indian shutler saina nehwal that she played better very well in all england badminton tournament while she lost the title.

సైనా టైటిల్ ఓడిపోయినా.. ప్రశంసించిన కేసీఆర్

Posted: 03/09/2015 12:22 PM IST
Telangana cm kcr praises saina nehwal all england badminton tournament

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్’ టోర్నీల్ ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే! ఇంతవరకూ ఏ భారతీయ మహిళ సాధించని ఈ ఘనతను సైనా సాధించడంతో.. ఇక టైటిల్ కూడా గెలుస్తుందని అంతా ఆశించారు. కానీ.. అంతలోనే అందరి ఆశలు అడియాశలయ్యాయి.

ఫైనల్లో జరిగిన టైటిల్ పోరులో సైనా తన శక్తిమేర ప్రయత్నించినప్పటికీ ఆమె గెలవలేకపోయింది. తొలి సెట్ లో అద్భుతంగా రాణించింది కానీ.. తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో ఆమె ఓటమిపాలయ్యింది. దీంతో భారతీయులంతా ఒక్కసారిగా నిరాశ చెందారు. అయితే.. ఆమె ఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించడం ఎంతో సాహసమంటూ ప్రముఖులంతా ఆమెకు కితాబిచ్చారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సైనా నెహ్వాల్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. టైటిల్ పోరులో సైనా ఓడిపోయినా.. టోర్నీ మొత్తంలో ఆమె ప్రదర్శన ఎంతో అద్భుతమని ఆయన అన్నారు. ‘ఇప్పటివరకు ఏ భారతీయ మహిళకూ సాధ్యం కానిది.. సైనా సాధించింది’ అంటూ ఆయన పేర్కొన్నారు. అందుకు సగటు భారతీయులంతా గర్వపడాలంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ఈయనతోపాటు ఇతర క్రీడా ప్రముఖులు సైనాను ప్రశంసించారు. టోర్నీలో సైనా ప్రదర్శన ఎంతో అమోఘమంటూ తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ షట్లర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  cm kcr  all england badminton tournament  

Other Articles