Dilsukhnagar school girl won gold medal in national taekwondo games

taekwondo games, school girl gayatri won gold medal taekwondo game, taekwondo games delhi, delhi taekwondo games, dilsukhnagar school girl gayatri won gold medal, taekwondo games gold medals, national taekwondo games

dilsukhnagar school girl won gold medal in national taekwondo games

జాతీయ తైక్వాండోలో నగర ‘‘స్వర్ణం’’!

Posted: 10/22/2014 01:52 PM IST
Dilsukhnagar school girl won gold medal in national taekwondo games

నగరానికి చెందిన ఒక స్కూల్ అమ్మాయి జాతీయ స్థాయిలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. నిన్నటివరకు ఎవరికీ తెలియని ఈ అమ్మాయి... నేడు జాతీయ మీడియాలో ‘‘స్వర్ణం’’లా వెలిగిపోతోంది. ఇటీవల భారత రాజధాని ఢిల్లీలో నిర్వహించిన తైక్వాండా పోటీల్లో నగరానికి చెందిన గాయత్రి పాల్గొంది. ఈమెతో పాటు ఈ ఈవెంట్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అమ్మాయిలు కూడా పోటీచేశారు. అందరూ ఆయా స్కూళ్ల నుంచి ఎన్నుకోబడిన వాళ్లు మంచి ప్రతిభావంతులు కూడా! అయితే అటువంటివాళ్లందరినీ దాటుకుని ఈ అమ్మాయి విశేషంగా నిలిచింది.

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫిట్‌జీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న గాయత్రి తైక్వాండో పోటీల్లో జూనియర్ విభాగంలో చక్కని ప్రతిభ కనబరుస్తూ... అందరినీ దాటుకుంటూ స్వర్ణ పతకం సాధించింది. పసిడి పతకంతో నగరానికి తిరిగొచ్చిన ఆమెను స్కూల్ ప్రిన్సిపాల్ పి. చంద్రశేఖర్‌రావు, యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. దేశవ్యాప్తంగా గర్వించదగ్గ ప్రతిభను గాయత్రి కనబరిచిందని కొనియాడారు. తైక్వాండోతో పాటు ఇతర క్రీడల్లోనూ రాణించేందుకు తమ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నట్లు చంద్రశేఖర్‌రావు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles