Parupalli kashyap create history by won the match with world fourth ranker and sindhu fails at first round

parupalli kashyap, kashyap latest news, parupalli kashyap kenichi games, french open badminton super series, saina nehwal, pv sindhu, gutta jwala, ashwini ponnappa, gutta jwala ashwini couple

parupalli kashyap create history by won the match with world fourth ranker and sindhu fails at first round

సంచలనం సృష్టించిన తెలుగబ్బాయి.. నిరాశపరిచిన తెలుగమ్మాయి!

Posted: 10/24/2014 01:16 PM IST
Parupalli kashyap create history by won the match with world fourth ranker and sindhu fails at first round

గతంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలిచి అప్పట్లో రికార్డు సాధించిన కశ్యప్... గతకొన్ని రోజుల నుంచి పేలవ పెర్ ఫార్మెన్స్ లతో వెనుదిరుగుతూ వచ్చాడు. మొన్న జరిగిన క్రీడల నేపథ్యంలో మొదట్లోనే పరాజయంపాలై భారతీయ అభిమానులకు తీవ్రనిరాశపరిచిన ఈ షట్లర్.. తాజాగా సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా ఆడుతున్న కశ్యప్.. తొలిరౌండ్లో ప్రపంచం నెం.4 ర్యాంక్ ఆటగాడయిన కెనిచి టాగో (జపాన్)కు షాకిచ్చాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్ లో 28వ స్థానంలో వున్న కశ్యప్.. తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఆటగాడును చాలా సునాయంగా ఓడించేశాడు. కేవలం 34 నిముషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో కశ్యప్ 21-11, 21-18 స్కోరుతో ఘనవిజయం సాధించాడు. తొలి గేమ్ ఆరంభంలో 5-1 ఆధిక్యంలో దూసుకెళ్లిన ఇతడు.. అదే జోరును కొనసాగించాడు. ఈ తొలి రౌండ్ లో భాగంగానే ఒక దశలో 19-7తో ఆధిక్యంలో వున్న అతడు.. చివర్లో 21-11 తో ముగించేశాడు. ఇక రెండో గేమ్ లోనూ అదే దూకుడును ప్రదర్శించాడు. మొదట్లో 5-1తో ఆధిక్యంలో వెళ్లగా.. తర్వాత 7-7 స్కోరుతో కెనిచి సమం చేశాడు. ఒక్కసారిగా ఆ జపాన్ ఆటగాడు చెలరేగడంతో రెండో రౌండ్ కశ్యప్ చేతిలోంచి చేజారిపోయిందని అనిపించింది. వీరిద్దరి మధ్య హోరాహోరీగానే పోరాటం సాగింది. 15-12 కెనిచి, కశ్యప్ తో ఆధిక్యం సంపాదించాడు. అయితే పట్టుబిగించిన కశ్యప్ చివరికి 21-18 స్కోరుతో విజయం సాధించాడు.

ఇదిలావుండగా.. బ్యాడ్మింటన్ స్టార్ అయిన పివి సింధు మాత్రం తన పేలవ ఫెర్ ఫార్మెన్స్ తో నిరాశపరిచింది. మహిళ సింగిల్స్ లో ఎనిమిదో సీడ్ సింధు.. తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది. హోరాహోమీరీగా సాగిన తొలిరౌండ్లో సింధు 21-12, 18-21, 16-21తో థాయ్ లాండ్ కు చెందిన అన్ సీడెడ్ పోర్న్ టివ్ బురాన ప్రసేర్ సుక్ చేతిలో ఓడిపోయింది. తొలిగేమ్ ను అలవోకగా గెలిచిన ఈ అమ్మడు.. తర్వాత రెండు గేముల్లో అదే జోరును సాగించడంలో విఫలం అయ్యింది. మరోవైపు సైనా నెహ్వాల్ ఓ ఫ్రెండ్ సిరీస్ లో శుభారంభం చేసింది. కేవలం 37 నిముషాల్లోనే ముగిసిన తొలి రౌండ్లో సైనా 21-16, 21-9 స్కోరుతో స్థానిక క్రీడాకారిణి సాషిన విగ్నేస్ ను ఓడించింది. అలాగే మహిళల డబుల్స్ లో తొలిరౌండ్లో జ్వాల-అశ్విని జంట 18-21, 21-16, 21-14 స్కోరుతో ఎఫీ ముస్కెన్స్, సెలీనా పీక్ జంటను ఓడించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parupalli kashyap  saina nehwal  pv sindhu  badminton tournament  gutta jwala - ashwini  

Other Articles