India to win more medals in asia games 2014

asian games, inchian, asia games, asia games finals, asia games schedule, asia games latest news, asia games india players, asia games update, latest news, sports news

indian players and athlets are going to rock in asian games 2014 : in all games of asian games 2014 indian participants are going well and have more chances of getting more medals

మనవారికి మంచి శకునాలే.., ఆసియా గేమ్స్ లో పతకాల పంట

Posted: 09/21/2014 03:55 PM IST
India to win more medals in asia games 2014

ఆసియా గే్మ్స్ భారత్ కు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. మనవారి అత్యుత్తమ ప్రతిభతో దూసుకెళ్తున్నారు. స్వ్కాష్, టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ ఇలా ప్రతి ఆటలోనూ మనవారు ముందుంటున్నారు. గత కాలపు చెప్పుకోలేని పతకలా సంఖ్యను ఈ సారి ఖచ్చితంగా పెంచుతారని విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు సాధించిన పతకాలను చూస్తే ఇది స్పష్టం అవుతోంది. కొన్నాళ్ళుగా ప్రపంచ వేదికలపై భారత్ పేలవమైన పోటి ఇస్తున్న నేపథ్యంలో ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తా చాటే అవకాశం వచ్చింది.

50 మీటర్ల పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన జీతూ రాయ్.. మరో పతకం సాధించాడు. పది మీటర్ల టీం షూటింగ్ విభాగంలో భారత షూటర్లు కాంస్య పతకం సాధించారు. జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాష్ నంజప్పా లతో కూడిన టీం ఫైనల్లోమూడవ స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా జీతూ రెండవ పతకం పొందాడు. అటు తొలిరోజే మహిళల సింగిల్స్ 10మీటర్ల షూటింగ్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యం సాధించి పతకాల ఖాతాను తెరిచింది.

ఇక టెన్నిస్ లో కూడా మనవారు సత్తా చాటారు. మెన్స్ సింగిల్స్ లో యూకీ బాంబ్రి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ లో నేపాలి ఆటగాడు జితేంద్ర పరియార్ పై బాంబ్రీ 6-0, 6-0 తేడాతో కనీసం కౌంట్ తెరవనీయకుండా చిత్తు చేశాడు. ఇక మరొక మ్యాచ్ లో అభిషేక్ బస్టోలా పై సనమ్ సింగ్ విజయం సాధించాడు. 6-0, 6-1 సెట్ల తేడాతో సనమ్ గెలుపొందాడు. విశేషం ఏమిటంటే ఇక్కడ కూడా ప్రత్యర్ధి అభిషేక్ నేపాలి కావటం అంతేకాకుండా అతను కూడా రెండు సెట్లలో కలిపి ఒక పాయింట్ కంటే ఎక్కువ గెలవలేకపోవటం. అటు మహిళల బ్యాడ్మింటన్ లో కూడా మన అమ్మాయిలు మంచి ప్రతిభ కనబర్చారు. కాకపోతే అక్కడక్కడా తడబడ్డారు.

స్క్వాష్ లో దీపికా పల్లికల్ పతకాన్ని రిజర్వు చేసి పెట్టింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో దీపిక దూసుకెళ్ళింది. అటు టాప్ సీడ్ గా ఉన్న సౌరవ్ గోషాల్ కూడా పతకం ఖచ్చితంగా వచ్చేలా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ఏ పతకం వస్తుంది అనేది ఫైనల్ లో వీరి ప్రతిభ ఆధారంగా తెలుస్తుంది. ఇలా ప్రతి ఆటలోనూ భారతీయ ప్లేయర్లు, అథ్లెట్లు ప్రతిభ చూపిస్తూ.. పతకాలను తీసుకొస్తున్నారు. ఇది భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఇండియా అంటే క్రికెట్ తప్ప మరొకటి తెలియదు అనే పేరు నానిపోయిన ప్రపంచం నాలుకలో ఇప్పుడు భారత్ అంటే అన్ని ఆటలకు అడ్డాగా నిలుస్తుందని మాటలు వస్తాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  india  sports news  latest news  

Other Articles