Indian women won bronze medals in squash game and pistol team event in asian games 2014

deepika pallikal latest news, deepika pallikal squash game, deepika pallikal squash game news, deepika pallikal bronze medal asian games, deepika pallikal asian game, pistol heena, pistol sarnobat, pistol aneesa, asian games 2014

indian women deepika pallikal won bronze medal in squash game and also heena, sarnobat, aneesa won bronze medals in pistol team event in asian games 2014

స్వర్ణంతో వెలగకపోయినా.. దీపం ఆరకుండా గౌరవం నిలబెట్టారు!

Posted: 09/22/2014 01:47 PM IST
Indian women won bronze medals in squash game and pistol team event in asian games 2014

ఆసియా క్రీడల్లో మన భారతదేశం తరఫునుంచి పలు విభాగాల్లో పాల్గొన్న మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కొన్ని క్రీడల్లో పురుషులు ఇంటిదారి పడుతున్నప్పటికీ మహిళలు మాత్రం ఓటమిని అంగీకరించకుండా దేశ గౌరవాన్ని కాపాడటంలో సఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్క్వాష్, పిస్టల్ ఈవెంట్ లో పాల్గొన్న మన భారతీయ మహిళలు స్వర్ణంతో వెలగకపోయినా.. కాంస్యంతోనే ఇంటిదీపం ఆరకుండా గౌరవాన్ని నిలబెట్టగలిగారు. తాము ఆశించిన విజయాన్ని అందకపోయినప్పటికీ... ఆశలు అడియాశలు కాకుండా తమనుతాము నిరూపించుకోవడంలో విజయం సాధించారు.

భారత స్క్వాష్ క్రీడాకారణి దీపికా పల్లికల్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం అందించి, దేశగౌరవాన్ని కాపాడుకోగలిగింది. మొదటినుంచి అద్భుతంగా ప్రదర్శిస్తూ అందిరినీ ముచ్చెమటలు పట్టించిన ఈ అమ్మడు.. చివరి నిముషంలో వెనుదిరిగి కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ప్రపంచ నెం.1 నికోల్ డేవిడ్ చేతిలో దీపికా ఓటమి చవిచూసింది. 25 నిముషాలపాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ప్రపంచంలో నెం.12 అయిన దీపిక 4-11,4-11,5-11 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆసియా క్రీడల్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కు లభించిన ఇదే తొలిపథకం.

ఇక పిస్టల్ టీమ్ ఈవెంట్ లో పాల్గొన్న ముగ్గురు మహిళలు హీనా, సర్నోబత్, అనీసాలు బాగానే ప్రదర్శించినప్పటికీ.. చివరికి కాంస్య పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా క్రీడల్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో ఒక్కొక్కరు కాంస్య పతకాలను సాధించి తమతమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో మన ఇండియాకు ఒకేసారి మూడు కాంస్య పతకాలు లభించాయి. మొదట్లో అందరినీ చమత్కరిస్తూ చివరిదాకా వచ్చిన ఈ ముగ్గురు.. తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూసి స్వర్ణాన్ని పొందలేకపోయారు. ఏదేమైనా.. ఆసియా క్రీడల్లో మహిళలు తమతమ ప్రతిభతో కాంస్యంతోనైనా భారత గౌరవాన్ని నిలబెట్టడంలో బాగానే పోరాడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : squash deepika pallikal  pistol heena  pistol sarnobat  pistol aneesa  asian games 2014  

Other Articles