కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ ఆసక్తికర ప్రచార వీడియోను పంచుకుంది. తన క్రికెట్ కెరీర్ కు త్వరలో వీడ్కోలు పలకబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్.. భారత్ కు వరల్డ్ కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనితో ఓ చక్కటి యాడ్ షూట్ చేసింది.
ఇందులో మిస్టర్ కూల్ మహేంద్రుడు వెరైటీ గెటప్పుతో దర్శనమివ్వడంతో నెట్ జనులతో పాటు క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబవుతున్నారు. జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో హుషారుగా గెంతుతూ వినోదం పండించాడు. ఐపీఎల్ 2021 మిగిలిన భాగాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో పిక్చర్ అభి భాకీ హై అన్న ట్యాగ్ తో చేసిన ఈ యాడ్ షూట్ ఆద్యంతం అకట్టుకుంటోంది. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తోందని, తుపానులా ఉంటుందని ధోనీ పేర్కొనడం ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్టాఫ్ ను మించిన థ్రిల్ ఖాయమని, క్లైమాక్స్ అదిరిపోతుందని ఓ సినిమా లెవల్లో పబ్లిసిటీ ఇచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more