Former cricketer Madhav Apte passes away మాజీ క్రికెటర్ మాధవ్ అప్టే కన్నుమూత

Former india international madhav apte passes away at 86

madhav apte, madhav apte death, madhav apte dies, madhav apte cricketer, madhav apte stats, madhav apte leg spinner, madhav apte opener batsman, first class cricket, Team India, sports news, cricket news, sports, cricket

Former Indian cricketer Madhav Apte passed away due to a cardiac arrest at the Breach Candy Hospital in Mumbai on Monday morning. He was 86 years old.

మాజీ క్రికెటర్ మాధవ్ అప్టే కన్నుమూత

Posted: 09/23/2019 11:31 AM IST
Former india international madhav apte passes away at 86

భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ గా రాణించిన ఓపెనర్ బ్యాట్స్ మెన్ మాధవ్ ఆప్టే ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు.

భారత క్రికెట్ జట్టు తరపున ఏడు టెస్టు మ్యాచులు ఆడిన అప్టే అటు ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా రాణించడంతో పాటు లెగ్ స్పిన్నర్ గా కూడా తన సేవలను అందించారు. పాకిస్థాన్ తో 1952లో జరగిన మ్యాచ్ తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన అప్టే మెత్తంగా 542 పరుగులను అంతర్జాతీయ వేదికలపై నమోదు చేశారు. మొత్తంగా 13 ఇన్నింగ్స్ అడిన అప్టే ఒక శతకం తో పాటు మూడు అర్థశతకాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు. మరోవైపు ఇటు రంజీ వేదికలపై కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. 1958-59, 1961-62లలో రెండు పర్యాయాలు ముంబై జట్టు రంజీ టైటిల్ ను సాధించి పెట్టడంలో ఆయన పాత్ర కీలకమైనదే. ఈ కుడిచేతి వాటం గల బ్యాట్స్ మెన్ మొత్తంమీద 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆయన 3,336 పరుగులు చేశారు.

లెగ్ స్పిన్నర్ గా తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన ఆప్టే.. విన్నూ మన్ ఖద్ సహకారంతో ఓపెనర్ బ్యాడ్స్ మెన్ గా కూడా రాణించి తన సత్తాను చాటారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన అప్పట్లో 165 పరుగల అత్యధిక స్కోరును కూడా నమోదు చేసుకున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు. మాధవ్ ఆప్టే మృతికి బీసీసీఐతో పాటు, పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhav apte  madhav apte death  madhav apte cricketer  cricket news  Team India  sports  cricket  

Other Articles