Orange Cap, Purple Cap and title winners ఐపీఎల్ 12: అరెంజ్, పర్పుల్ క్యాప్ లు వీరికే..

Ipl 2019 orange cap purple cap and title winners

IPL 2019, David Warner, Orange Cap, Imran Tahir, Purple Cap, IPL list of winners, MI vs CSK, Mumbai Indians, Chennai Super Kings sports news,sports, latest sports news, cricket news, cricket

IPL 2019 is over and Mumbai Indians are champions for a record 4th time. David Warner won the Orange Cap and Imran Tahir won the Purple Cap.

ఐపీఎల్ 12: అరెంజ్, పర్పుల్ క్యాప్ లు వీరికే.

Posted: 05/13/2019 08:05 PM IST
Ipl 2019 orange cap purple cap and title winners

ఐపీఎల్ 2019 సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు.? అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసా.? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కు ఆరేంజ్ క్యాప్ ను.. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారు. అయితే ఐపీఎల్ 12వ సీజన్ లో వీటిని దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో మాత్రం మనవాళ్లు లేకపోవడం కొసమెరుపు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్‌లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసమని ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ముందే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత వరుసలో 14 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 593పరుగులతో నిలిచాడు. దీంతో కేఎల్ రాహుల్ మోస్ట్ సైలిష్ ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్  పర్పుల్ క్యాప్‌తో ముగించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్‌లో 2వికెట్లు తీసి సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ 2వికెట్లు తాహిర్ చేతికి చిక్కాయి. 40ఏళ్ల ఇమ్రాన్ 17మ్యాచ్‌ల్లో 26వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత వరసలో కగిసో రబాడ 25వికెట్లు తీసి రెండో ప్లేయర్‌గా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2019  David Warner  Orange Cap  Imran Tahir  Purple Cap  sports  Cricket  

Other Articles