heart broken csk fan video goes viral on net గుండె పగిలిన చెన్నైకింగ్స్ బుడత అభిమాని ఏం చేశాడంటే..

Heart broken csk fan video goes viral on net

Indian Premier League, Chennai Super Kings, Mahendra Singh Dhoni, MS Dhoni, Dhoni, zeva, sakshi dhoni, CSK, CSK Fan, IPL, Chennai Super Kings, Season 2019, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Chennai super kings had lost the IPL 12 season with just one run, which left many csk fans heart broken, here a boy who was watching the match and praying for his team win cries jumping after malinga taken wicket of the last ball.

గుండె పగిలిన చెన్నైకింగ్స్ బుడత అభిమాని ఏం చేశాడంటే..

Posted: 05/14/2019 09:30 PM IST
Heart broken csk fan video goes viral on net

ఐపీఎల్ 12 సీజన్ ముగిసింది. ఒక్క పరుగుతో చేతికందిన టైటిల్ చేజార్చుకుని రన్నర్ అప్ గా చెన్నై నిలిచింది. ఆఖరు బంతితో ఆటగాడిని కట్టడి చేయడమే కాక అతని వికెట్ తీయడంతో మలింగా హీరోగా నిలువగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా నిలిచింది. హైదారబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తమకు విజయం వరిస్తుందని, అందుకు తమకు కలిసోచ్చే వేదిక కూడా దోహదం చేస్తుందని భావించిన చెన్నై ఒక్క పరుగుతో ఒటమిని చవిచూడటంతో చెన్నై జట్టు భావోద్వేగానికి లోనైంది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమితో ధోని అంతటి మిస్టర్ కూల్ కూడా నిరాశకు లోనయ్యారు. ఇక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పరిణితి చెందిన అభిమానులు నిట్టూర్పును వదిలేయగా, కొందరు మాత్రం ఒక్క పరుగు ఎంత ప్రాధాన్యత వుందో తెలియజేసిందంటూ మరికోందరు వ్యాఖ్యలు చేస్తూ సర్థిచెప్పుకున్నారు. అయితే పెద్దలు విషయం పక్కన బెడితే ఈ చిన్నారి అభిమాని మాత్రం చెన్నై ఓటమితో తీవ్రంగా కలత చేందాడు.

చివరి ఓవర్ వచ్చేసరికి దేవుడ్ని ప్రార్థిస్తూ మ్యాచ్ ను తిలకిస్తున్న తెలంగాణ శేరిలింగంపల్లికి చెందిన ఈ బాలుడు.. లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్ లో తమ అభిమాన జట్టు గెలవాలని కాంక్షిస్తూ వున్నాడు. మొదటి మూడు బంతుల్లో చెన్నై నాలుగు పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రనౌట్‌ గా పెవిలియన్ కు చేరాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో దేవుడా చెన్నైని గెలిపించూ అంటూ అర్థించాడు.

ఇక సూపర్ ఓవర్ ఫలితాన్ని తేలుస్తుందని భావించిన క్రమంలో మలింగా వేసిన అఖరు బంతికి శార్ధూల్ ఠాకూర్ అనూహ్యంగా ఔటయ్యాడు. దీంతో ఈ బాల అభిమాని తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఎగురుకుంటూ ఏడ్చేశాడు. అప్పటి వరకు కుర్చీలో కూర్చున్న బాలుడు అమాంతం పైకి లేచి ఎగురుకుంటూ గంతులేస్తూ ఏడుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు తన తల్లిని బిగ్గరగా పిలుస్తూ.. అయ్యో.. అయ్యో ఇలా జరిగిందే అంటూ తన భాధను వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles