India declare at 7-443 on day two in Melbourne Test బాక్సింగ్ డే టెస్టులో పటిష్ట స్థితిలో భారత్..

India vs australia 3rd test day 2 in melbourne australia trail by 435 runs at stumps

Ajinkya Rahane, Aus vs Ind 2018, Aus vs Ind day two score, Aus vs Ind score, Australia vs India, australia vs india 2018, Cheteshwar Pujara, cricket score, Ind vs Aus, IND vs AUS Score, India vs Australia, India vs Australia 2018, rohit sharma, virat kohli, cricket, cricket news, sports news, latest sports news, sports

Australia remain unscathed on 8-0 after India declared on 443-7. It's been a nervy stay at the crease for the Australian batsmen while they've been out in the middle, and they'd be glad to end the day to start afresh once again on Day 3.

బాక్సింగ్ డే టెస్టులో పటిష్ట స్థితిలో భారత్.. 443 వద్ద డిక్లేర్

Posted: 12/27/2018 05:58 PM IST
India vs australia 3rd test day 2 in melbourne australia trail by 435 runs at stumps

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 443/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 8/0తో నిలిచింది. క్రీజులో ఓపెనర్లు అరోన్ ఫించ్ (3 బ్యాటింగ్: 23 బంతుల్లో), హారిస్ (5 బ్యాటింగ్: 13 బంతుల్లో) ఉన్నారు. ఆట ఇంకా మూడు రోజులు మిగిలి ఉండగా.. పిచ్ క్రమంగా బౌలర్లకి అనుకూలంగా మారుతోంది. నిన్న ప్రయోగాత్మక ఓపెనర్ హనుమ విహారి (8: 66 బంతుల్లో) విఫలమైనా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76: 161 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకంతో మెరిసిన విషయం తెలిసిందే.

ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 215/2తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టులో చతేశ్వర్ పుజారా (106: 319 బంతుల్లో 10x4), విరాట్ కోహ్లి (82: 204 బంతుల్లో 9x4), రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. మిడిల్ ఓవర్లలో అజింక్య రహానె (34: 76 బంతుల్లో 2x4), రిషబ్ పంత్ (39: 76 బంతుల్లో) కాసేపు రోహిత్ శర్మకి అండగా క్రీజులో నిలిచినా.. మెరుగైన స్కోరు చేయలేకపోయారు. దీంతో.. జట్టు స్కోరు 443 వద్ద రవీంద్ర జడేజా (4: 3 బంతుల్లో 1x4) ఔటవగానే భారత్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లని నిన్న చివరి సెషన్‌లో సమర్థంగా ఎదుర్కొన్న పుజారా-కోహ్లీ జోడీ.. ఈరోజు తొలి సెషన్‌లోనూ వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా.. పుజారా.. చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మరోవైపు కోహ్లీ వేగంగా ఆడకపోయినా.. పుజారాకి సహకారం అందిస్తూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 114వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన పుజారా కెరీర్‌లో 17వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో పుజారాకి ఇది రెండో శతకం కావడం విశేషం. అడిలైడ్ జరిగిన తొలి టెస్టులోనూ పుజారా సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajinkya Rahane  Aus vs Ind 2018  day two score  melbourne test  cricket  

Other Articles