msd to enter 500 matches club in england tour మరో రికార్డును అందుకునేందుకు ధోని రెడీ..

Ms dhoni knocking at the door of another record

MS Dhoni, 500 match club, england tour, ireland, Sachin Tendulkar, international cricket, Record, rahul dravid, cricket

ms dhoni రnocking at the door of another record, who is to enter 500 club in england tour after sachin tendulkar and rahul dravid most international cricket matches

మరో రికార్డును అందుకునేందుకు ధోని రెడీ..

Posted: 06/27/2018 04:38 PM IST
Ms dhoni knocking at the door of another record

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు అందుకునేందుకు చేరువయ్యాడు. భారత్‌ తరఫున ఈ రికార్డును ఇప్పటి వరకు సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే అందుకోగలిగారు. ఏమిటా రికార్డు అంటే.. టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం. ప్రస్తుతం ధోనీ 497 (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) మ్యాచ్ లతో ఉన్నాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్ తో రెండు టీ20లు, ఇంగ్లాండ్తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు.

ఈ ఎనిమిది మ్యాచుల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఆడిన మ్యాచుల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్ తో రెండు టీ20లతో పాటు జులై 3న ఇంగ్లాండ్‌తో టీ20 ఆడనున్నాడు. ఈ మూడు మ్యాచ్లు ఆడితే ధోనీ 500 మ్యాచుల క్లబ్‌లో చేరనున్నాడు. కాగా, మాస్టార్ బ్లాస్టర్ సచిన టెండుల్కర్ 664 (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1) మ్యాచులతో అగ్రస్థానంలో వున్నాడు. ఆ తరువాతి స్థానంలో రాహుల్ ధ్రావిడ్ 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు.

కాగా, ధోని ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల ద్వారా వారి రికార్డులకు చేరువ కానున్నాడు. అయితే త్వరలో ధోనీ భారత్‌ తరఫున 500 మ్యాచులు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇక ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌ ఆసియా కప్‌ ఆడనుంది. ఈ టోర్నీలో ధోనీ ఆడితే ద్రవిడ్‌ రికార్డును బద్దులకొట్టే అవకాశం ఉంది. అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చుకున్నా సచిన్‌దే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే(652) ఉన్నాడు. కుమార సంగాక్కర (594) మూడో స్థానంలో ఉండగా.. మహేంద్ర సింగ్‌ ధోనీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles