India beat Sri Lanka by 141 runs in Mohali లంకపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..

India beat sri lanka by 141 runs in mohali level odi series 1 1

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, mohali, punjab, Sri Lanka, Team India, Rohit Sharma, double centuries, rohit sharma double centuries, shreyas iyer, shikhar dhawan, MS Dhoni, Hardik Pandya, sports news, sports, latest sports news, cricket news, cricket

Skipper Rohit Sharma rose to the occasion when it mattered most as his record breaking third double hundred guided India to a series-levelling 141-run win against Sri Lanka in the second ODI

లంకపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. సిరీస్ సమం..

Posted: 12/13/2017 08:00 PM IST
India beat sri lanka by 141 runs in mohali level odi series 1 1

భారత్‌-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేల్లో టీమిండియా ధర్మశాల ప్రతీకారాన్ని తీర్చుకుంది. పర్యాటక జట్టు శ్రీలంక  ను 141 పరుగలు తేడాతో ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో లంక విఫలమైంది. లంక బ్యాటింగ్ లో అంజిలో మాథ్యూస్(111) ఒంటిరి పోరాటం చేసి శతకాన్ని నమోదు చేసినప్పటికీ.. మరో ఎండ్ నుంచి మిగితా ఆటగాళ్ల మద్దతు లభించలేదు. మిగతా బ్యాట్స్ మెన్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుకోడంతో శ్రీలంక 50 ఓవర్లలో.. 251 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 208 పరుగులు చేసి అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతనికి కొత్తగా అరంగ్రేటం చేసిన శ్రీయాస్అయ్యార్ నుంచి చక్కని భాగస్వామ్యం లభించింది. ధర్మశాల మ్యాచ్ నుంచి అరంగ్రేటం చేసిన అయ్యార్ రెండో వన్డేలో అర్థశతకాన్ని నమోదు చేసి.. 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా అద్బుతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆ భారీ టార్గెట్‌ని చేరుకోవడంతో విఫలమైంది.

62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక జట్టు ఆ తర్వాత కొద్దిపాటి పరుగల తేడాతోనే వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది. మ్యాథ్యూస్ మినహా కీలక ఆటగాళ్లు పెరీరా(5), తరంగా(7), గుణతిలకా(16) స్వల్ప పరుగులకే పెవీలియన్ బాటపట్టారు. మిడిలాడర్ ఆటగాళ్లు డిక్‌వెల్(22), గుణరత్నే(34) భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరిగారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కాగా భారత్ బౌలింగ్‌లో చహాల్ 3, బుమ్రా 2, భువనేశ్వర్, పాండ్య, సుందర్ తలో వికెట్ తీశారు. మ్యాచ్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  mohali  Sri Lanka  Team India  Rohit Sharma  double centuries  cricket  

Other Articles