Dhoni will play 2023 World Cup, says Clarke 2023 ప్రపంచ కప్ కూడా ధోని అడుతాడు..

Ms dhoni will play in 2023 world cup says michael clarke

ms dhoni, ms dhoni india, india ms dhoni, michael clarke, michael clarke dhoni, dhoni world cup, cricket world cup, Team India, india cricket team, cricket news, sports news, sports, cricket

Asked whether MS Dhoni would play in the coming 2019 World Cup, Michael Clarke said, "Don't ask me whether he will play in the 2019 World Cup. He will play in 2023."

అది ధోని వల్ల మాత్రమే సాధ్యం: మాజీ కెప్టెన్

Posted: 09/20/2017 09:17 PM IST
Ms dhoni will play in 2023 world cup says michael clarke

టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీని అంటే ఎరుగని వర్తమాన క్రికెటర్లే కాదు సీనియర్ క్రికెటర్లూ వుండరు. ఆయపై విమర్శలు చేసే వారి సంఖ్య వేళ్లపె లెలక్కపెట్టే స్థాయిలో వుంటే.. ఆయనను ప్రశంసించే వారి సంఖ్య అసంఖ్యాకమని చెప్పవచ్చు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మరోసారి ప్రశంసల జల్లులు కురిపించారు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేతో కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడిన ధోనిని 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అని పేర్కొన్న క్లార్క్‌.. దిగ్గజ ఆటగాడైన ధోని కచ్చితంగా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులోనే కాదు 2023లో జరిగే వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడిగా ఉంటాడంటూ జోస్యం చెప్పారు.

ఇందుకు ధోని ఫిట్ నెస్ లెవల్స్ కారణమని క్లార్క్ చెప్పారు. ధోని ప్రతిభ, ఆటతీరుపై తనకేమాత్రం సందేహం లేదన్నారు. ఇక అసీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఫలితాన్ని తేల్చేది కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేనేనన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ధోని అద్భుత ఆటతీరుతో రాణించి లంకపై 5-0తో టీమిండియాను గెలిపించాడన్నారు. లంకతో వన్డే సిరీస్ ఫలితమే ధోని నైపుణ్యానికి నిదర్శనమన్నాడు. వచ్చే వరల్డ్ కప్ జట్టులో ధోని అటపై సెలక్టర్లు ఆయన రాణించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టాపార్డర్ కుప్పకూలి, పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్‌ పాండ్యాతో కలసి చక్కదిద్దిన నేర్పరి ధోని అని మైఖెల్ క్లార్క్ కొనియాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Michael Clarke  Mahendra Singh Dhoni  Team India  cricket  

Other Articles