India crush Sri Lanka by record 304 runs, lead 1-0 జహీర్ ఎంపిక పట్ల అభిమానుల హర్షం

India crush sri lanka by record 304 runs lead 1 0 in 3 test cricket series

Team India, BCCI, india vs sri lanka, ind vs sl, virat kohli, india cricket, galle test, virat kohli, shikhar dhawan, cheteshwar pujara, indian cricket news, cricket news, sports news, latest news, sports, cricket

VIRAT Kohli rediscovered his best form in the first Test against Sri Lanka, racking up a second-innings century in the tourists’ 304-run win in Galle.

గాలే టెస్టులో టీమిండియా విజయఢంకా..

Posted: 07/29/2017 09:06 PM IST
India crush sri lanka by record 304 runs lead 1 0 in 3 test cricket series

శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతోనే ప్రారంభించింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ సేన సమిష్టి కృషికి ఫలితాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ ఫీల్డ్ లో కూడా అద్భుతంగా రాణించి ప్రత్యర్థి జట్టుకు చుక్కుల చూపించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.

అనూహ్యంగా టీమిండియా జట్టులో స్థానం లభించిన శిఖర్ ధావన్ తొలి ఇన్నింగ్స్ లో తన సత్తా చాటాడు. కొద్దిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్న ధావన్ 190 పరుగుల స్కోరు టీ20 మ్యాచ్ తరహాలో చేయడం.. దానికి మరో బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా కూడా జతకలసి 153 పరుగులతో రాణించడంతో తొలిఇన్నింగ్స్ చేసిన భారి స్కోరు విరాట్ సేన విజయానికి బాటలు వేసింది. వీరిద్దరికి తోడు రహానే (57), హార్డిక్ పాండ్య (50), అశ్విన్ (47) ఆకట్టుకోవడంతో భారత్ 600 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తరంగ (64) మాధ్యూస్ (83), పెరీరా (92) పోరాడడంతో తొలి ఇన్నింగ్స్ 291 పరుగులు చేసింది.

అనంతరం మరోసారి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కోహ్లీ (103) సెంచరీతో రాణించగా, అభినవ్ ముకుంద్ (81) ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్ ను 240 పరుగుల వద్ద ముగించింది. అనంతరం 550 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. అశ్విన్, జడేజా ధాటికి లంకేయులు కేవలం 245 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించారు. కరుణ రత్నే (97) సుదీర్ఘ ఒంటరి పోరాటం చేశాడు. డిక్ వెల్లా (67), మెండిస్ (36) నుంచి చక్కని సహకారం లభించింది. పెరీరా (21) నాటౌట్ గా నిలిచాడు. దీంతో శ్రీలంక జట్టు 304 పరుగుల తేడాతో తొలి టెస్టులో పరాజయం పాలైంది. ఈ టెస్టులో 6 వికెట్లతో జడేజా రాణించగా, నాలుగు వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. షమి మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు, పాండ్య ఒక వికెట్ తీశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  TeamIndia  virat kohli  Test match  galle test cricket  

Other Articles