We were all crying after the match: Harmanpreet Kaur ఫైనల్స్ తరువాత అలా చేశాం: హర్మన్ ప్రీత్

We were all crying after the match harmanpreet kaur

ICC Women's World Cup 2017, India vs England, ICC WWC final, india, england, jhulan goswami, mithali raj, womens cricket, Harmanpreet kaur, smriti mandana, deepti sharma, India Women's Cricket Team, cricket news, cricket, sports news, latest news

India's dashing batter Harmanpreet Kaur admitted, that the mood was very grim after coming so close to lifting the trophy against the England women. India lost the title clash by nine runs.

ఫైనల్స్ తరువాత అలా చేశాం: హర్మన్ ప్రీత్

Posted: 07/25/2017 07:58 PM IST
We were all crying after the match harmanpreet kaur

ఇంగ్లాండ్ వేదికగా జరుగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్స్ లో అతిథ్య జట్టు చేతిలో ఓటమి పాలైన తరువాత ఏం జరిగింది..? జట్టు సభ్యులు ఈ పరాజయాన్ని తేలిగ్గా తీసుకున్నారా..? లేక ఇది వారిని తీవ్రంగా భాధించిందా..? అంటే అందుకు సంబంధించిన విషయాలను టీమిండియా వైస్ కెప్టెన్, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వివరించారు. ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి పాలవ్వడంతో జట్టు సభ్యులందరం ఏడ్చేశామని తెలిపింది. విజయానికి అతి చేరువగా వచ్చి ఓటమి పాలవ్వడంతో దానిని జీర్ణంచుకోలేకపోయామని తెలిపింది. జట్టు మొత్తాన్ని ఈ పరాజయం కలచివేసింది. దీంతో ఏ ఒక్కరూ కన్నీటిని ఆపుకోలేకపోయారని.. ఒక్కర్నీ చూడగానే మరోకరి కంట్లోంచి నీళ్లు వచ్చేశాయని.. అందరం ఏడ్చేశామని తెలిపింది.

జట్టు యాజమాన్య సిబ్బంది మమ్ముల్ని బాధపడొద్దని చెబుతూనే ఉన్నా.. తాము మాత్రం బాధను ఆపుకోలేకపోయామని చెప్పింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం తమ బాధ తగ్గిందని అన్నారు. ఆ తరువాత హోటల్‌కి చేరుకునే సమయంలో ఇక విచారించడం సబబు కాదని, ఫైనల్ వరకు చేరినందుకు రన్నర్ అప్ గా నిలిచినందుకు సంతోషించాలని జట్టు సిబ్బంది పదే పదే చెప్పడంతో విందు ఆరగిస్తూ వేడుకలు చేసుకున్నామని చెప్పింది. తన జట్టుని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాననింది.

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని తెలిపింది.. అంతేకాదు ఈ టోర్నీలో మేము అద్భుతంగా ఆడాము. ఇక గతం మర్చిపోయి... విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకెళ్లాగలం అన్న విశ్వాసం మాలోని ప్రతీ ఒక్కరిలో వుందని కౌర్ తెలిపింది. క్రికెట్‌ ఆడటం తన కల అని.. తన కలతోనే జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని తాను భావిస్తున్నానని చెప్పారు. మహిళా క్రికెట్‌ పట్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో అవగాహన పెరుగుతోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles