Zaheer Khan named bowling coach by BCCI జహీర్ ఎంపిక పట్ల అభిమానుల హర్షం

Zaheer khan named bowling coach by bcci

Team India, BCCI, Mahendra Singh Dhoni, virat kohli, sourav ganguly, sachin tendulkar, vvs laxman, zaheer kahn, coach zaheer khan, bcci, committee of administrators, indian team bowling coach, indian cricket news, rajeev shukla, cricket news, sports news, latest news

Former India pacer Zaheer has been appointed bowling coach by BCCI. The 38-year-old has played 92 Tests and picked up 311 wickets and has 282 scalps to his name from 200 ODIs.

జహీర్ ఎంపిక పట్ల అభిమానుల హర్షం

Posted: 07/12/2017 06:53 PM IST
Zaheer khan named bowling coach by bcci

టీమిండియా మాజీ పేసర్‌ జహీర్ ఖాన్ మనస్సులో వున్న కోరికను తన రాజీనామా సందర్భంగా బయటపెడ్డాడో లేదో.. అంతే అందివచ్చిన అవకాశమంటూ బిసిసిఐ ఆయనను అక్కున చేర్చుకుంది. అదేంటి అంటారా..? తనకు అవకామిస్తే టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తానని ఆయన తన మదిలోని మాటను బయటపెట్టారు. అంతే టీమిండియాకు ప్రధాన కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను భుజాతకెత్తుకున్న బిసిసిఐ త్రిసభ్య కమిటి.. జహీర్ ఖాన్ కూడా బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

టీమిండియా ప్రధాన కోచ్ ఎవరవుతారన్నదే ఇన్నాళ్లు క్రికెట్ అభిమానులకు అసక్తి రేపిన నేపథ్యంలో బిసిసిఐ సలహా కమిటీలోని సభ్యులు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, వీవిఎస్ లక్ష్మణ్ లు ఈ అనూహ్య నిర్ణయంతో అభిమానులు ప్రశంసలను అందుకుంటున్నారు. మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఆటగాడిగా జహీర్ ఖాన్ కు పేరుంది. భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జహీర్.. తన పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో సూపర్ విక్టరీలు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ టెస్టు నంబర్ వన్ కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.

వెన్ను, మెకాలి గాయాలు ఆయనను వెన్నాడడంతో ఆయన తన కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిన విషయం అభిమానులకు తెలిసిందే. క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు సారధిగా వ్యవహరించాడు. అతడి అనుభవం, పరిజ్ఞానం భారత యువ ఫాస్ట్ బౌలర్లకు ఎంతో ఉపయక్తం అవుతుందని అంచనా వేసిన సలహా కమిటీ అయనను బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేసింది. విదేశీ పర్యటనల నేపథ్యంలో జహీర్‌ అనుభవం మరింత కీలకం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaheer kahn  coach zaheer khan  bcci  indian team bowling coach  indian cricket news  cricket  

Other Articles