How cricketers are patrioatic asks Mashrafe Mortaza మాలో దేశభక్తి ఎక్కడుంది..? బంగ్లా కెప్టెన్ సంచలన వ్యాఖ్య

Telugu content

champions trophy 2017, ICC Champions Trophy 2017, england, Mashrafe Mortaza, bangladesh, patriotism, cricketers, cricket news, cricket, sports news, latest news

Bangladesh lost to India in the semifinals of the ICC Champions Trophy 2017. Captain Mashrafe Mortaza does not understand cricket-based patriotism, saying that every cricketer is paid for playing cricket. then where comes the question of partriotic.

మాలో దేశభక్తి ఎక్కడుంది..? బంగ్లా కెప్టెన్ సంచలన వ్యాఖ్య

Posted: 06/20/2017 03:08 PM IST
Telugu content

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో బాగా రాణించి.. దిగ్గజ క్రికెట్ టీమ్ అస్ట్రేలియా కన్నా అధికంగా పాయింట్లు రాబట్టుకుని తొలిసారిగా సెమీఫైనల్స్ వరకు వెళ్లిన బంగ్లాదేశ్.. టీమిండియా చేతిలో ఓటమితో తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే.. అయితే ఇంటికి చేరిన తరువాత బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రాఫ్ ముర్తజా తాము పెద్ద దేశభక్తులం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే కాదు డబ్బులు తీసుకుని క్రికెట్ అడే ఏ ఒక్క క్రీడాకారుడు నిజమైన ధేశభక్తి వున్నవాళ్లు కాదన్నాడు.

క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదన్నాడు. తాము కేవలం క్రీడాకారులే తప్పితే.. దేశభక్తికి స్టార్లమంటూ క్రికెటర్లను అకాశానికెత్తే అవసరం లేదని అన్నాడు. చిన్నప్పట్నించి ఎంతో దీక్ష, పట్టుదలతో ఓ క్రీడలలో బాగా రాఱించి దేశం తరపున అడుతున్న తమను దేశభక్తి స్టార్లుగా పరిగణించడం తప్పని అన్నాడు. తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు దేశభక్తిని అంటగట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. క్రికెటర్లకు, దేశభక్తికి ముడిపెట్టడం తగదని మొర్తాజా తెలిపాడు.
 
తాము డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడతామని.. అటువంటప్పుడు తమకు దేశభక్తి ఏక్కడిదని ఆయన ప్రశ్నించారు. నిజమైన స్టార్లు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్లు, రైతులు, కూలీలు మాత్రమేనని అన్నాడు. తాను ఒక క్రికెటర్ని మాత్రమేనన్నాడు. తనకు వైద్యడిలా ఒక ప్రాణాన్ని కాపాడే శక్తిలేదని, కనీసం రైతుల మాదిరిగా దేశ ప్రజల అకలిని తాను తీర్చలేనని చెప్పాడు. అయితే రైతుల కోసం, డాక్టర్లు కోసం ఎవ్వరూ క్లాప్స్ కొట్టరని అన్నాడు.

వైద్యలకు అన్ని విధాలా గుర్తింపు తీసుకురావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. డాక్టర్లుకు మంచి అదరణ లభిస్తే వారు ఇంకొన్ని ప్రాణాల్ని నిలబెడతారని పేర్కోన్నాడు. అంతేకాదు కొన్ని అద్భుతాలను చేసే శక్తి డాక్టర్లకు ఉందన్నాడు. వాళ్లే రియల్ స్టార్స్ అని పేర్కొన్నాడు. వైద్యులతో పాటు రైతులు, కూలీలు, శ్రామికులు కూడా దేశ అభివృద్దికి తోడ్పడుతున్నారని వాళ్లూ స్టార్లేనన్నాడు. దయచేసి క్రికెటర్లను హీరోలుగా గుర్తించొద్దవద్దని మొర్తజా ఒక వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  england  Mashrafe Mortaza  bangladesh  patriotism  cricketers  cricket  

Other Articles