Harbhajan puts forth Zaheer name for coach బౌలింగ్ కోచ్ గా జహీర్ పేరును ప్రతిపాదించిన స్పిన్ దిగ్గజం

Zaheer khan would be the best option for indian fast bowling coach

zaheer khan, harbhajan singh, bowling coach zaheer, india coach, harbhajan singh, harbhajan, Twitter, sachin tendulkar, ms dhoni, social media, Twitter, virat kohli, kohli, virat, india cricket, cricket

Senior India off-spinner Harbhajan Singh has voiced his support for Zaheer Khan as the bowling coach.

బౌలింగ్ కోచ్ గా జహీర్ పేరును ప్రతిపాదించిన స్పిన్ దిగ్గజం

Posted: 05/23/2017 10:20 PM IST
Zaheer khan would be the best option for indian fast bowling coach

టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఎవరినైనా నియమించాలని బిసిసిఐకి ప్రతిపాదన వెళ్లిన నేపథ్యంలో ఈ స్థానానికి జహీర్ ఖాన్ పేరును పరిశీలించాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. జహీర్ ఖాన్ ను టీమిండియా బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్న స్పిన్‌ మాంత్రికుడు హర్భజన్‌ సింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు భజ్జీ సోషల్ మీడియా (ట్విట్టర్) ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపాడు. టీమిండియా చీఫ్‌ కోచ్ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు బీసీసీఐని క‌లిసి ఒక ఫాస్ట్ బౌలింగ్ కోచ్ కావాలని కోరిన విషయం తెలిసిందే. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ తో బిసిసిఐ కుదర్చుకున్న ఒప్పందం ముగియడంతో.. తాజాగా కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేలు బిసిసిఐ ఎదుట ఈ ప్రతిపాదనను పెట్టారు.

ఈ నేప‌థ్యంలో హ‌ర్భజ‌న్ సింగ్ స్పందిస్తూ.. భారత జట్టుకు ఫాస్ట్‌ బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను ఎంచుకోవడం అనేది మన ముందున్న మంచి ఆప్షన్ అని పేర్కొన్నాడు. భజ్జీ అభిప్రాయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతించారు. 2015లో జహీర్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన ఐపీఎల్-10వ సీజన్ లో జహీర్‌ దిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాడు. జట్లును కీలక సమయాల్లో గెలుపు దరికి చేర్చడంలో కూడా దోహదపడిన జహీర్ కు కోచ్ పదవి లభిస్తుందో లేదో.. తెలియాలంటే మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaheer khan  harbhajan singh  bowling coach  Twitter  cricket  

Other Articles