Mumbai Indians pull off stunning 1 run win over Pune

Mi pull off incredible one run win over rps to emerge champions

Mumbai Indians IPL 10, Mumbai Indians IPL 10, IPL 10 Final, IPL WInner, IPL Pune MI, MI Pune Final Match, IPL 10 Final, Mumbai Indians RPS, Rising Pune Supergiant, Mumbai Indians lift IPL 10 Trophy, IPL 10 Dhoni Innings, IPL 10 Final Uppal, IPL 10 Final Match Review, IPL 10 Victory

Mumbai Indians beat Rising Pune Supergiant, become 3-time champions with IPL 2017 win.

Telugu Content

Posted: 05/22/2017 07:45 AM IST
Mi pull off incredible one run win over rps to emerge champions

ఐపీఎల్-10వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠమైన ఈ పోరులో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పై ‘ముంబై ఇండియన్స్’ విజయం సొంతం చేసుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో చివరి బంతి దాకా మజా అందుకున్నారు ఆడియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభం నుంచే తడబడింది. కేవలం 129 పరుగుల టార్గెట్ పుణే ముందు ఉంచింది.

ఇక 130 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్ లో 11 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై బౌలర్ మిచెల్ జాన్సన్ అద్భుత బౌలింగ్ తో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా పుణె ప్లేయర్స్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. మూడో పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో సుందర్ రనౌట్ అవడంతో పుణె జట్టు ఓటమి పాలయింది.

కాగా, ‘ముంబై ఇండియన్స్’ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ లో తొలిసారిగా విజేతగా నిలిచే అద్భుత అవకాశాన్ని పుణె జట్టు చేతులారా పోగొట్టుకోగా, అత్యధిక సార్లు టైటిళ్లు గెలుచుకున్న టీంగా ముంబై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు చెన్నై, హైదరాబాద్ లు రెండేసి సార్లు కప్పు గెలుచుకున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 10  Mumbai Indians  Rising Pune Supergiant  

Other Articles