IPL final: mumbai vs pune who wins the title.? తుది సమరంలో గెలుపెవరిదో..? ముంబై వర్సెస్ ఫూణే..

Ipl 2017 final mumbai indians vs rising pune supergiant who will win title

IPL 2017, IPL final, IPL champion, IPL Title winner, kolkata knight riders, Mumbai Indians, piyush chawla, MS dhoni, steve smith, rising pune super gaints, Uppal stadium, hyderabad stadium, sports, cricket

IPL FINAL between Mumbai Indians and Rising Pune Supergiant at the Rajiv Gandhi International Stadium in Uppal who wins the title.?

తుది సమరంలో గెలుపెవరిదో.. ముంబై వర్సెస్ ఫూణే..

Posted: 05/21/2017 11:51 AM IST
Ipl 2017 final mumbai indians vs rising pune supergiant who will win title

దేశీయ క్రికెట్ అభిమానుకు ఐఫీఎల్ ఫీవర్ అవహించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో గత పదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నీలో ఈ సారి టైటిల్ ఎవరు సాధిస్తారన్న ఉత్కంఠకు మరికొద్ది గంట్లల్లో తేలిపోనుంది. ఇటు దేశీయంగా అటు ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ సీజన్ 10 అంతిమ సమరానికి మరికోన్ని గంట్లలో తెరలేవనుంది. అదిలో అంతంతమాత్రంగా రాణించినా.. చివరకు ఫైనల్స్ బర్త్ కన్ఫామ్ చేసుకున్న తొలిజట్టుగా రైజింగ్ ఫూణే సూపర్ జెయింట్ నిలిచింది. ఇప్పటికే రెండు పర్యాయాలు టైటిల్ ను కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఫూణేతో తది సమరంలో తలపడనుంది.

ఈ తుది సమరానికి హైదరాబాద్ అతిత్యమివ్వనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలవనుండగా, మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు దక్కించుకున్న అభిమానులు మ్యాచ్ ఎప్పడెప్పుడు ప్రారంభమవుతుందా..? అంటూ అసక్తిగా ఎదురుచూస్దున్నారు. ముంబై ఇండియన్స్- పుణె సూపర్ జెయింట్స్ రెండు జట్లపైనా భారీ అంచనాలు నెలకొనడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక టిక్కెట్లు దక్కని అభిమానులు ఇళ్లలోని టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు.

ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయి రికార్డు సృష్టించాలని ముంబై పట్టుదలగా ఉండగా, ఎలాగైనా ట్రోఫీ సాధించాలని పుణె భావిస్తోంది. మహారాష్ట్రకే చెందిన ఈ రెండు జట్ల మధ్య పోరు ‘మరాఠా వార్’గా మారనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. దీంతో సమ ఉజ్జీల సమరంలో విజేతగా నిలిచేదెవరన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. లీగ్‌లో పుణె చేతిలో ముంబై మూడుసార్లు ఓడినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. నాలుగోసారి ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆ జట్టులో అనుభవజ్ఞులు ఉండడమే అందుకు కారణం.

ఇక ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణె అసాధారణ ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హాట్ టాపిక్ అయింది. అయితే అంచనాలు, ప్రిడిక్షన్లు గతంలో టైటిల్ ను గెలిచిన వారీగా చూసుకుంటే ఈ సారి ముంబై ఇండియన్స్ జట్టుకు కొద్దిగా నిరాశే ఎదురవుతుందని క్రీకెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు పర్యాయాలు ఫూణే చేతిలో ఓటిమికి గురైన ముంబై అసాధారణ ప్రతిభను కనబరిస్తే తప్ప వారిని విజయం వరించదని అంటున్నారు. మరో వైపు ఫూణే టీమ్ గత కొంత కాలంగా మ్యాచ్ లన్నింటినీ గెలుస్తు విన్నింగ్ స్ర్ఫీ కొనసాగించడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఎవరేం చెప్పినా విజేతలు ఎవరన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL champion  IPL final  Mumbai indians  rising pune  IPL-10  cricket  

Other Articles