PCB Taking Legal Recourse Against BCCI బిసిసిఐపై దావా వేస్తామని పిసీబి హెచ్చరికలు

Pcb taking legal recourse against bcci

bcci, Board of Control for Cricket in India, icc, India vs Pakistan, India vs Pakistan Bilateral Ties, najam sethi, Pakistan Cricket Board, pcb

Pakistan Cricket Board (PCB) senior official Najam Sethi announced that the PCB has intimated BCCI on taking legal recourse as the BCCI did not honour the MoU pertaining to bilateral series

బిసిసిఐపై దావా వేస్తామని పిసీబి హెచ్చరికలు

Posted: 04/27/2017 05:21 PM IST
Pcb taking legal recourse against bcci

సరిహద్దులో ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్.. వరుసగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. కాశ్మీర్ లోని యువతను వక్రమార్గం పట్టిస్తూ.. చేస్తున్న కుట్రలకు, కుతంత్రాలకు నిరసనగా పాకిస్థాన్ తో ఎలాంటి దైపాక్షిక సిరీస్ లను జరపకూడదని భావించిన భారత క్రికెట్ నియంత్రణ మండలికి హెచ్చరికలు వచ్చాయి. బిసిసిఐ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దీంతో తమకు భారీగా నష్టం వచ్చిందని అవేదన వ్యక్తం చేస్తున్న పిసీబి ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని బిసిసిఐకు హెచ్చరికలు పంపింది.

చాన్స్ దోరికనా.. దోరక్కపోయినా భారత్ క్రికెట్ మండలిపై విరుచుకుపడుతూ.. విమర్శలు గుప్పించే పీసీబి తాజాగా బీసీసీఐపై దావా వేస్తామని పేర్కోంది. తమతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకపోవడం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని... ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు తాము దావా వేస్తామని పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ తెలిపారు. దుబాయ్ లో ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు.

2014లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకు ఇరు దేశాలు 6 ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాల్సి ఉందని సేథీ చెప్పారు. అయినా, తమతో సిరీస్ లు ఆడేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని ఆయన మండిపడ్డారు. బీసీసీఐ వ్యవహారశైలితో తాము దాదాపు రూ. 1200 కోట్లు నష్టపోయామని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ బీసీసీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దూకుడు పెంచేందుకు పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  India  icc  India vs Pakistan  Bilateral Series  najam sethi  pcb  

Other Articles