ధోనిని వేనకేసువచ్చిన స్మిత్. బ్రెట్ లీ.. Brett Lee has come in support of MS Dhoni

Steve smith not too concerned about dhoni s form

Steve Smith, Brett Lee, MS Dhoni, Rising Pune Supergiant, Ravindra Jadeja, ipl 2017, Delhi Daredevils, BCCI, cricket

Rising Pune Supergiant skipper Steve Smith on Thursday backed MS Dhoni, who has been struggling with the bat in the last three games, and said that he was not too concerned about the form of the former India captain.

ధోనిని వేనకేసువచ్చిన స్మిత్. బ్రెట్ లీ..

Posted: 04/14/2017 04:47 PM IST
Steve smith not too concerned about dhoni s form

ఐపీఎల్-10లో టీమిండియా మాజీ కెప్టెన్.. పూణే సూపర్ జెయింట్స్ తరపున అతంగా రాణించలేకపోవడమే ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ధోనీ పేలవ ప్రదర్శనతో ఆయన ఐపీఎల్ లో కొనసాగడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అందోళన వ్యక్తం చేస్తూ ఇక ఆయన కొనసాగింపు కష్టమన్న తరహాలో సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో ధోనికి మద్దతుగా నిలిచాడు పూణే కెప్టన్ స్మీత్. ఆయనతో పాటు అసీస్ మాజీ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ కూడా మద్దతు పలికాడు.

ధోనీ ఫామ్ గురించి తమకు ఎలాంటి దిగులు లేదని స్మిత్ చెప్పాడు. తమ జట్టు కేవలం మూడు మ్యాచ్ లే ఆడిందని... మిగతా మ్యాచ్ లలో ధోనీ పుంజుకుంటాడని అశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ ఓ అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు. పూణె జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ మూడు మ్యాచ్ లకు గాను కేవలం 28 పరుగులు మాత్రమే చేసి, నిరాశ పరిచాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్లే ధోనీ అలా ఆడుతున్నాడంటూ మరోపక్క విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇక స్మీత్ తో పాటు అసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కూడా ధోనిని వేనకేసుకువచ్చాడు. ధోని త్వరగా ఫామ్ లోకి రావాలని అభిప్రాయపడ్డారు. ధోని మంచి నైపుణ్యం కలిగిన అటగాడని, ఆయన టీమిండియాకు అందించిన విజయాలను అప్పుడే మర్చిపోయి అడలేదన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. ధోని ఫామ్ లోకి వస్తే ఆయన అద్భుత ఆటను చూడగలమని, రానున్న మ్యాచ్ లలో ఆయన తన స్థాయిని అందుకుని తన బ్యాట్ నుంచి పరుగుల సునామీని సృష్టించగలడని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles