ఐసీసీ చైర్మన్ గా కొనసాగునున్న శశాంక్ మనోహర్..! Shashank Manohar defers resignation as ICC chairman

Shashank manohar does a u turn to stay on as icc chairman

Shashank Manohar, ICC,International Cricket Council, ICC Chairman, ICC Board, Nazmul Hassan, ICC, David Peever, BCCI, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

Shashank Manohar has deferred his resignation as the chairman of the International Cricket Council following a request from the ICC board.

ఐసీసీ చైర్మన్ గా కొనసాగునున్న శశాంక్ మనోహర్..!

Posted: 03/24/2017 07:29 PM IST
Shashank manohar does a u turn to stay on as icc chairman

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, అ పోస్టుకు రాజీనామా చేసి ఐసీసీ సీఈఓకు రాజీనామా లేఖను పంపిన శశాంక్ మనోహర్.. ఎనమిది రోజుల తరువాత మళ్లీ తన బాధ్యతలను తాను నిర్విర్తిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే తిరిగి ఐసిసి చైర్మన్ గా పదవిలో కోనసాగడంతో పాటుగా తిరిగి బాధ్యతలను చేపడతానన్నారు. తన వ్యక్తి గత కారాణాల నేపథ్యంలో పదవిలో కొనసాగలేకపోతున్నానని.. ఇక ఐసీసీ సెలవంటూ రాజీనామా చేసిన ఆయన ఇవాళ యూ టార్న్ తీసుకున్నారు.

చైర్మన్ పదవి నుంచి తప్పుంకటుంటున్నట్లు తాను సీఈవో రిచర్డ్ సన్ కు రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కోన్నారు. అయితే ఇప్పటికీ తాను తన మాటపైనే నిలబడనున్నట్ల ప్రకటించిన శశాంక్.. బోర్డు సభ్యులు చర్చించి పలు తీర్మాణాలు చేయాల్సి వుందని చెప్పిన నేపథ్యంలో తాను కోంత కాలం వరకు మాత్రమే చైర్మన్ పదవిలో కోనసాగుతన్నట్లు తెలిపారు.

వచ్చే నెలలో పలు కీలకమైన ఐసీసీ సమావేశాలు వుండటం.. వాటిల్లో పలు తీర్మాణాలను అమోదించాల్సిన అవసరం వున్నందున చైర్మన్ హోదాలో తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ప్రధానంగా మనోహర్ ఆకస్మిక రాజీనామాపై ఐసీసీలోని సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిలో భాగంగానే ఏప్రిల్ ల్లో జరిగే సమావేశాలు వరకూ మనోహర్ చైర్మన్ గా కొనసాగాలని పట్టుబట్టారు. దాంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఆయన జూన్‌ వరకు ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles