ఆ నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేసింది Marlon Samuels cleared to resume bowling

West indies marlon samuels allowed to resume bowling

Marlon Samuels, Kolkata Knight Riders, IPL, West Indies, ICC, illegal action, cricket news, sports news, cricket

West Indies pacer Marlon Samuels has been cleared to bowl again after serving a 12-month ban for an illegal bowling action.

బౌలింగ్ లో పునరాగమనం చేయనున్న శామ్యూల్స్

Posted: 02/17/2017 05:08 PM IST
West indies marlon samuels allowed to resume bowling

వివాదాస్సద యాక్షన్ తో దాదాపు 13 నెలల పాటు బౌలింగ్ కు దూరంగా ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్  కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గత నెల్లో  అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అతని బౌలింగ్ శైలిని పరీక్షించిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్యామ్యూల్స్ తాజా బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉన్నట్లు పేర్కొన్న ఐసీసీ.. ఇక నుంచి అతను తిరిగి అంతర్జాతీ మ్యాచ్ ల్లో బౌలింగ్ చేయవచ్చిన స్పష్టం చేసింది.

2015అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. దాంతో అతనిపై 12 నెలల పాటు నిషేధం విధిస్తూ అదే ఏడాది డిసెంబర్ లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అతని బౌలింగ్ శైలిపై తొలిసారి 2013లో వివాదం చెలరేగింది. ఆ తరువాత రెండేళ్లకు అతని బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. దాంతో అతని బౌలింగ్ పై ఏడాది నిషేధం విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marlon Samuels  West Indies  ICC  illegal action  cricket  

Other Articles

Today on Telugu Wishesh