తూచ్.. నేనా..? రాజకీయాల్లోకా..? అప్పుడేనా..? Harbhajan dismisses rumours that he is set to join politics

Harbhajan singh dismisses speculations of joining politics

harbhajan singh, navjot singh sidhu, jalandhar, cricket, politics, Twitter, Congress

Veteran Indian off-spinner Harbhajan Singh has brushed aside speculations suggesting that he might be joining politics anytime soon, saying he has no intention

తూచ్.. నేనా..? రాజకీయాల్లోకా..? అప్పుడేనా..?

Posted: 12/22/2016 05:54 PM IST
Harbhajan singh dismisses speculations of joining politics

టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన సెకెండ్ ఇన్నింగ్స్ కు సంబంధించి వస్తున్న వదంతులను భారత క్రికెటర్‌, ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌  హర్భజన్‌సింగ్‌ తోసిపుచ్చారు. అసలు తనకు తెలియకుండానే ఈ వదంతులు ఎలా తెరపైకి వస్తున్నాయో కూడా తెలియడం లేదన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోకాంగ్రెస్‌ పార్టీలో ఆయన చేరనున్నట్టు కథనాలు రావడంపై అయన స్పందించారు. ఈ కథనాలను తోసిపుచ్చుతూనే తనకు ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న అలోచన లేదన్నారు.

‘త్వరలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. వదంతులు వ్యాప్తి చేయడాన్ని దయచేసి మానుకోండి’  అని హర్భజన్‌ ట్విట్టర్‌లో కోరారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరంలో జరగనున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ బీజేపీని వీడి త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బాటలోనే భజ్జీ కూడా కాంగ్రెస్‌లో చేరుతారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  navjot singh sidhu  jalandhar  cricket  politics  Twitter  Congress  

Other Articles