క్రికెటర్ అఫ్ ది ఇయర్ అశ్విన్.. వన్డే కెప్టెన్ గా కోహ్లీ.. Ashwin named ICC Cricketer of the Year

Year of champions kohli ashwin bag big honours at the icc awards

ICC Cricketer of the Year, Ravichandran Ashwin, icc odi captain, virat kohli, Rohit Sharma, Ravindra Jadeja

Team India's frontline spinner Ravichandran Ashwin (December 22) was named the ICC cricketer of the year and Test cricketer of the year.

క్రికెటర్ అఫ్ ది ఇయర్ అశ్విన్.. వన్డే కెప్టెన్ గా కోహ్లీ..

Posted: 12/22/2016 06:08 PM IST
Year of champions kohli ashwin bag big honours at the icc awards

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈ ఏడాది బెస్ట్ క్రికెటర్ల జాబితాను ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో టీమిండియా స్పిన్ మాంత్రికుడిగా పేరొందడంతో పాటు ఇటు బ్యాటుతోనూ తన పరుగుల వరదను కూడా పదునెక్కించి రికార్డులు నెలకొల్పిన రవిచంద్రన్ అశ్విన్ కు ఈ ఏటి మేటి క్రికెటర్ అవార్డుతో పాటు ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు కూడా దక్కింది. దీంతో పాటు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అశ్విన్ ఖాతాలోకి చేరిపోయింది.

ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సౌతాఫ్రికా ఆటగాడు క్విన్టన్ డీ కాక్ కు దక్కగా, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కు ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. టీ-20 పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడిగా వెస్టిండీస్ కు చెందిన కార్లోస్ బ్రాత్ వైట్ ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన డ్రీమ్ టీమ్ లో వన్డే టీమ్కు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎంపిక కాగా, అయనతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా స్థానం దక్కింది.

ఐసీసీ అనుబంధ అసోసియేట్ దేశాల క్రికెటర్లలో ఉత్తమ ఆటగాడిగా ఆఫ్గనిస్థాన్ కు చెందిన మొహమ్మద్ షహజాద్ ఎంపికయ్యాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు మిస్బా ఉల్ హక్, ఉత్తమ అంపైర్ గా మారిస్ ఎరాస్మస్ ఎంపికైన సంగతి విదితమే. అవార్డు విజేతలందరికీ ఐసీసీ అభినందనలు తెలిపింది. ఇక ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ - 2016లో ఇండియాకు చెందిన స్మృతీ మందనకు మాత్రమే స్థానం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా వెస్టిండీస్ కు చెందిన స్టెఫానీ టేలర్ ఎంపికైంది.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి...
 
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం):

1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా - వికెట్ కీపర్)
3. రోహిత్ శర్మ (ఇండియా)
4. విరాట్ కోహ్లీ (కెప్టెన్ -ఇండియా)
5. ఏబీ డివీలియర్స్ (దక్షిణాఫ్రికా)
6. జాస్ బట్లర్ (ఇంగ్లండ్‌)
7. మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
8. రవీంద్ర జడేజా (ఇండియా)
9. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
10. కగిసో రబడా (దక్షిణాఫ్రికా)
11. సునీల్ నరైన్ (వెస్టిండీస్)
12. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)
 
 
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం):
 
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్)
3. కేన్ విలియంసన్ (న్యూజిలాండ్)
4. జో రూట్ (ఇంగ్లండ్‌)
5. ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా)
6. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ - వికెట్ కీపర్)
7. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
9. రంగనా హీరత్ (శ్రీలంక)
10. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
11. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
12. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles