ఆ అరోపణల రచ్చను ఎన్నటికీ మర్చిపోలేను McCullum won't forgive Chris Cairns over fixing saga

Brendon mccullum won t forgive chris cairns over fixing saga

brendon mccullum, mccullum, chris cairns, cairns, mccullum cairns, cricket fixing, match fixing, cricket match fixing, cricket Cricket news, sports news, sports

Brendon McCullum was prosecution star witness in Chris Cairns' perjury trial, which ended with the latter acquitted of all charges.

ఆ అరోపణల రచ్చను ఎన్నటికీ మర్చిపోలేను

Posted: 10/20/2016 06:09 PM IST
Brendon mccullum won t forgive chris cairns over fixing saga

తన సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్ గతంలో తనపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ అరోపణలను జీవితంలో మర్చిపోలేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేర్కొన్నాడు. అయన చేసిన అరోపణలు తన కెరీర్ పైనే కాకుండా తన బావి జీవితంపైన కూడా ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటిని తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. క్రిస్ కెయిన్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం.. తనను కూడా ఆ బరుదగంటలోకి లాగే ప్రయత్నం చేశాడని మెకల్లమ్ అన్నాడు.

తన ప్రతిష్టకు భంగం కలగడానికి అతను ప్రవర్తించిన తీరే కారణమన్నాడు. క్రిస్ కెయిన్స్ చేసిన అరోపణలను న్యూజీలాండ్ సహా ప్రపంచ క్రికెట్ లో తన గురించి తెలిసినవారెవరూ విశ్వసించరన్నారు. ఆ ఘటనను తాను ఎప్పటికీ మరచిపోలేనన్నాడు. కెయిన్స్ కేసులో తాను కూడా సాక్షం ఇచ్చానని.. అయితే తనను కూడా కొంతమంది బుకీలు కలిశారంటూ అప్పుడు ఆరోపణలు వచ్చాయన్నాడు. ఈ అరోపణలు ఉత్పన్నం కావడానికి కారణం మాత్రం కెయిన్స్ అని అయన కుండబద్దలు కోట్టారు. తనకు క్షమాగుణం ఎక్కువని. తన జీవితంలో చాలా వివాదాలు చూసినా వాటిని ఏటినీ మనసులో పెట్టుకోలేదన్నాడు.

అయితే ఆనాటి ఫిక్సింగ్ ఆరోపణల ఘటన మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. తాను ఎప్పుడూ ఫిక్సింగ్ అనే చాపలో ఇరుక్కోవాలని అనుకోలేదు' అని మెకల్లమ్ పేర్కొన్నాడు.  2008లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గతేడాది అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ  లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగిన అతను ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ సమయంలో మెకల్లమ్, రికీ పాంటింగ్లు కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : McCullum  Chris Cairns  match fixing  new zealand  cricket  

Other Articles