ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ రికార్డ్.. 'Special day' for record-setting Cook

England captain cook set to break test caps record

Alastair Cook, England vs Bangladesh, First Test, Chittagong, Test Record, 134th Test Match, Alec Stewart, Cricket news, google news, sports news, sports, cricket

Alastair Cook is mentally preparing to become England's most capped Test player as he gets ready to lead his team against Bangladesh in the first Test.

ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ రికార్డ్..

Posted: 10/20/2016 05:41 PM IST
England captain cook set to break test caps record

ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. తమ జాతీయ జట్టులో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక టెస్టులాడిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తో ఇవాళ ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో బరిలోకి దిగి అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 133 టెస్టులాడిన అలెక్‌ స్టివార్ట్‌ రికార్డును కుక్ అధిగమించి తన పేరున రికార్డును రాసుకున్నాడు. కుక్‌ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతడే కావడం విశేషం.

47.31 సగటుతో అతడు ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి.అత్యధిక వ్యక్తిగత స్కోరు 294. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడి అందరికంటే ముందున్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుక్ కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alastair Cook  Test Record  134th Test Match  Alec Stewart  cricket  

Other Articles