అరుదైన ఘనత సాధించిన వృద్దిమాన్ సాహా Saha joins elite club with twin fifties

Saha joins elite club with twin fifties

ind vs nzl second test, Eden Garden, new zealand, rohit sharma, virat kohli, wriddhiman saha, Team India, virat kiohli, anil kumble, cricket, cricket news, India, India vs New Zealand 2016, Martin Guptill, new zealand, sports news, sports

Wriddhiman Saha became the first wicketkeeper to score two fifties in a Test at Eden Gardens since 1951. The ones to do it before him were Dilawar Hussain, Clyde Walcott and Dick Spooner.

అరుదైన ఘనత సాధించిన వృద్దిమాన్ సాహా

Posted: 10/03/2016 05:33 PM IST
Saha joins elite club with twin fifties

కోల్ కత్తా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీమీండియా యువ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన సోంత గ్రౌండ్ స్వరాష్ట్ర అభిమానుల మధ్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా కోల్ కతా నగరంలో ఈడెన్ గార్డెన్లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు సాధించి అజేయంగా నిలిచాడు. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్  రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శతకాలు సాధించిన నాల్గో వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు.

ఈ మ్యాచ్లో సాహా(54 నాటౌట్, 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించాడు. దీంతో పాటు తొలిసారిగా సాహా మ్యాన్ అప్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక గత ఏడు టెస్టు ఇన్నింగ్స్ ల్లో సాహా (40, 47, 104, 14,0, 54 నాటౌట్, 58 నాటౌట్లు) కేవలం రెండు ఇన్నింగ్స్ ల్లోనే విఫలం కావడం అతని ప్రతిభకు అద్ధం పడుతోంది. అయితే అంతకుముందు ఈ ఘనతను అందుకున్న భారత వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోని, దిల్వార్ హుస్సేన్, ఫరూఖ్ ఇంజనీర్లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles