సచిన్ అరుదైన రికార్డును బ్రేక్ చెయ్యనున్న కుక్ | Sachin Tendulkar's Test Record Faces Alastair Cook Threat

Sachin tendulkar s test record faces alastair cook threat

sachin, Sachin Tendulkar, Test Cricket, Alastair Cook, Ten thousand runs, సచిన్ కుక్, పది వేల పరుగులు

One of Sachin Tendulkar's many cricket records could soon be erased. England captain Alastair Cook is 36 runs shy of becoming the youngest batsman to score 10,000 Test runs. Tendulkar was 31 years and 10 months old when he scored 10,000 Test runs. The landmark came against Pakistan in Kolkata in March 2005. It was the second Test at Eden Gardens and Tendulkar, batting at No. 4, had identical scores of 52 in both innings.

సచిన్ అరుదైన రికార్డును బ్రేక్ చెయ్యనున్న కుక్

Posted: 05/06/2016 04:16 PM IST
Sachin tendulkar s test record faces alastair cook threat

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాదించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. కానీ ఆయన సాధించిన ఓ అరుదైన రికార్డు మాత్రం తొందరలోనే ఓ క్రికెటర్ తుడిచేస్తాడని కనిపిస్తోంది. ఆయన సాధించిన రికార్డులను ఎవరూ కనీసం తాకరు అని అనుకున్న వారికి ఇది షాకింగే. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా పాత రికార్డులను బ్రేక్ చేస్తూ... కొత్త రికార్డును సృష్టించడానికి ఓ క్రికెటర్ సిద్దంగా ఉన్నాడు. ఈడెన్ గార్డెన్ లో ఏళ్ల క్రితం సచిన్ టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అప్పుడు సచిన్ వయస్సు 31 ఏళ్లు. సచిన్ రికార్డుల్లో ఇది కూడా అరుదైనది.

అలాంటి రికార్డును ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ చేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే తక్కువ వయసులోనే టెస్టుల్లో 10 వేల పరుగుల రికార్డును అందుకునేందుకు కుక్‌ దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం 31 ఏళ్ల కుక్‌ టెస్టుల్లో 9,964 పరుగులతో ఉన్నాడు. ఇందులో 28 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మే 19 నుంచి ఇంగ్లాండ్‌.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో కుక్‌ మరో 36 పరుగులు సాధిస్తే అప్పటి సచిన్‌ వయసు కంటే 5 నెలల తక్కువ వయసులోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2005లో పాకిస్తాన్ పైన 31 ఏళ్ల వయస్సులో పదివేల పరుగులు చేశాడు. అప్పుడు సచిన్ వయస్సు కచ్చితంగా 31 ఏళ్ల పది నెలలు. ఇప్పుడు కుక్ వయస్సు అంతకంటే అయిదు నెలలు తక్కువగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles