విధ్వంసకరమైన బ్యాటింగ్ కు అలవాలమైన పొట్టి క్రికెట్ లో గెలుపు ఎప్పుడు ఏ ఒక్కరి సోంతం కాదు, ఎప్పుడు ఏ క్షణాన మ్యాచ్ మలుపు తిరుగుతుందో కూడా తెలియదు అదే టీ 20 ఫార్మెట్ అంటూ ఇప్పటికే విశ్లేషుకులు చెప్పారు, అయితే ప్రత్యర్థులను కట్టడి చేయడానికి జట్టు కెప్టెన్లు ఎంతో శ్రమిస్తారు. అటు మానసికంగా ఇటు శారీరికంగానూ శ్రమించడం మనం చూస్తున్నాం, ప్రత్యర్థులను కట్టడి చేసే పనిలో భాగంగా ఎన్నో వ్యూహాలు రచిస్తుంటారు, అందుకోసం బౌలర్లతో పలు రకాల చర్చలు జరుపుతుంటారు.
ఇక ఫోట్టి క్రికెట్ ఫార్మెట్ లో బ్యాటింగ్ లో అదరగోడుతున్న బెంగుళూరు ఇటు బౌలింగ్ విభాగంలో మాత్రం బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు. అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు.
మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more