Marlon Samuels fined 30 per cent match fee for breach of ICC code of conduct

West indies batsman fined for breaching icc code of conduct

icc t20 world cup 2016, Samuels, ICC Code of Conduct, west indies, england, T20 finals, eden gardens, west indies vs england, wi vs eng, west indies england, west indies vs england, england t20, west indies t 20, virat kohli, kohli, dhoni, joe root, chirs gayle, england, cricket england, england cricket, cricket west indies, west indies criccket, cricket news, cricket

Marlon Samuels was found to have breached Article 2.1.4 of the ICC Code of Conduct for Players and Player Support Personnel.

బౌలర్‌పై బ్యాట్స్ మెన్ తిట్లదండకం.. భారీ జరిమానా..

Posted: 04/04/2016 05:04 PM IST
West indies batsman fined for breaching icc code of conduct

టీ 20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన తుది సమరంలో గెలుపు ముంగిటకు చేరుకునే క్రమంలో వెస్టీండీస్ బ్యాట్స్ మెన్  మార్లన్‌ సామ్యూల్స్‌పై ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టైటిల్ పోరు కోసం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్‌ బౌలర్లపై తిట్లవర్షం కురిపించిన సామ్యూల్స్‌పై ఐసీసీ భారీ జరిమానా విధించింది.  మ్యాచ్‌ ఫీజులో 30శాతం జరిమానా మోపింది. చివరి ఓవర్‌ వేసిన బెన్‌ స్టోక్‌పై మార్లన్ తిట్లవర్షం కురిపించాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆటగాళ్లు, వారి సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.1.4ను అతడు ఉల్లంఘించినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంగ్లండ్ బౌలర్లపై సామ్యూల్స్‌ అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మొదట ఫీల్డ్ ఎంపైర్లు కుమార్ ధర్మసేనా, రాడ్ టకర్‌, థర్డ్ ఎంపైర్ మారైఎస్ ఎరాస్మస్, ఫోర్త్ ఎంపైర్ బ్రుస్ ఆక్సెన్‌ఫర్డ్‌ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలను అంగీకరించిన సామ్యూల్స్‌.. మ్యాచ్ రీఫరీ రంజన్ ముదుగలె విధించిన జరిమానాకు అంగీకరించారు. ఎదుటి జట్టు ఆటగాళ్లను దూషించడం ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనగా భావిస్తారు. ఇందుకు సదరు ఆటగాడిపై గరిష్ఠంగా 50శాతం వరకు జరిమానా విధిస్తారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  Samuels  ICC Code of Conduct  west indies  england  T20 finals  eden gardens  

Other Articles