India vs Australia: It was a pretty serious innings, says Steve Smith on Virat Kohli’s unbeaten 82

Australia failed to dominate key moments says steve smith

india vs australia, australia vs india, ind vs aus, aus vs ind, Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, Shane Watson, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Steven Smith said his team was in a winning position before an unbelievable innings from Virat Kohli took the game away from Australia.

17 ఓవర్ల వరకు అంతా మా చేతిలోనే వుంది..

Posted: 03/28/2016 05:33 PM IST
Australia failed to dominate key moments says steve smith

అప్పటివరకు అంతా మా చేతిలోనే ఉన్నట్లు అనిపించింది. ఒక్కసారిగా ఏమైందో తెలీదు గానీ.. మొత్తం మ్యాచ్ తిరిగిపోయింది. ఏంటా అని చూస్తే విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. ఇక మేం ఏమీ చేయలేకపోయాం''.. ఇదీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందన. అతడు చెప్పింది అక్షరాలా నిజం. టీమిండియాకు అప్పటివరకు రన్ రేట్ 7 మాత్రమే ఉంది.. చేతిలో ఉన్నవి కేవలం 4 ఓవర్లు.. విజయం కావాలంటే ఇంకా చేయాల్సినవి 47 పరుగులు. అంటే, సగటున ఓవర్‌కు 12 పరుగుల వరకు రావాలి. అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యమని ఎవరూ అనుకోలేదు.

కానీ, 17వ ఓవర్ ప్రారంభం కాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి పరుగుల వేగం పెరిగింది. ఇక జేమ్స్ ఫాల్కనర్ వేసిన 18వ ఓవర్‌లో అయితే ధోనీ- కోహ్లీ కలిసి ఏకంగా 19 పరుగులు రాబట్టారు. అనుమానిస్తూనే నాథన్ కౌల్టర్ నీల్‌కు కెప్టెన్ స్మిత్ బంతి అప్పగించాడు. ఆ ఓవర్‌లో కూడా చెలరేగి.. 16 పరుగులు చేశారు. ఇక చివరి ఓవర్‌లో విజయానికి కావల్సినవి కేవలం నాలుగే పరుగులు. క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ ధోనీ.. తనదైన శైలిలో బంతిని బౌండరీకి తరలించి లాంఛనం పూర్తిచేశాడు.

నిజంగా ఈ ఇన్నింగ్స్ గొప్పదని స్టీవ్ స్మిత్ అన్నాడు. టీమిండియా ప్రతి బంతికి రెండు పరుగుల చొప్పున చేయాల్సి రావడంతో తాము చాలా పటిష్ఠంగా ఉన్నాం అనుకున్నానని, 160 పరుగులు, అది కూడా ఇలాంటి వికెట్ అంటే మంచి స్కోరేనని చెప్పాడు. కానీ, ఒత్తిడిలో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ చేజారిపోయిందని అన్నాడు. ఛేజింగ్‌లో కోహ్లీ యావరేజ్ అద్భుతంగా ఉందని, సరిగ్గా కావల్సిన సమయంలో రాణించినందుకు కోహ్లీకి హ్యాట్సాఫ్ అని స్మీత్ తెలిపాడు. కోహ్లీ చాలా మంచి క్రికెట్ షాట్లు ఆడతాడని, సరిగ్గా గ్యాప్ చూసుకుని కొట్టడంలో నిపుణుడని ప్రశంసలు కురిపించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  australia  world twenty 20  semi finals  ind vs aus  steve smith  cricket  

Other Articles