I was only trying to send across a positive message: Shahid Afridi

Shahid afridi says his love in india remark is a positive message

icc world t20, icc world t20 scores, world t20 news, world t20 scores, pakistan, shahid afridi pakistan, pakistan cricket, afridi captain, cricket pakistan, sports news, sports, cricket

Shahid Afridi on Tuesday skipped the team’s training session, citing “fever”, ahead of their ICC World Twenty20 opener against Bangladesh in Kolkata.

పాజిటివ్ మెసేజ్ ఇచ్చాను. పాక్ అభిమానులను తక్కువ చేయలేదు

Posted: 03/15/2016 07:48 PM IST
Shahid afridi says his love in india remark is a positive message

భారత్‌లోనే పాకిస్థాన్‌ క్రికెటర్లకు అమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న తన వ్యాఖ్యలపై తన స్వదేశంలో విమర్శలు వస్తుండటంతో పాక్ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివరణ ఇచ్చుకున్నాడు. తన దేశాన్ని, స్వదేశంలోని అభిమానులను చిన్నబుచ్చే ఉద్దేశం తనకు లేదని, అయితే భారత్ లోని అభిమానులపై గౌరవాన్ని చాటుతూ సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే తాను చేశానని ఆయన పేర్కొన్నాడు. తాను పాకిస్థాన్ జట్టుకు సారథిని మాత్రమే కాదు, పాక్ ప్రజలందరి తరఫున ప్రతినిధినని చెప్పుకోచ్చారు.

తన వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాలని విన్నవించారు. పాకిస్థాన్ అభిమానుల కన్నా ఇతరులెవరూ తనకు ఎక్కువనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదున్నారు. తనకు ప్రస్తుతమున్న ఈ గుర్తింపు మొత్తం పాకిస్థాన్ నుంచి వచ్చిందేనని అఫ్రిది పేర్కొన్న ఆడియో సందేశాన్ని పీసీబీ తన ట్విట్టర్‌లో పేజీలో పోస్టు చేసింది. అఫ్రిదీ గత ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు.

కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్‌ చేశాను. అందులో భారత్ ఒకటి.  ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పాక్‌ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తోపాటు పలువురు అఫ్రిది వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల వివాదాన్ని చల్లబర్చేలా పత్రికా ప్రకటన చేసిన అఫ్రిది.. సానుకూల దృక్పథంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది కాబట్టి భారత్‌లో ఆడినప్పుడు మేం బాగా ఆస్వాదిస్తామని చెప్పానని, ఇదేమాటను గతంలో వసీం అక్రం, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్‌ కూడా చెప్పారని అఫ్రిది గుర్తుచేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  Javed Miandad  Pakistan cricket team  T20 world cup  India vs Pakistan  

Other Articles